మెయిల్స్ తరచుగా పంపించే వారికి ఇది ఒక వరం లాంటిది. ఎప్పుడూ ఒకే టైప్ లో మెయిల్స్ పంపడం మానేయండి. మెయిల్ సందేశానికి అనుగుణంగా అందమైన చిత్రాలతో మీ భావాలను వ్యక్తపరచండి. అంతే కాకుండా మీ వాయిస్ రికార్డింగ్ మరియు ఇమేజిల్ ఇన్సెర్ట్ చేయడం, అటాచ్ మెంట్స్ , సిగ్నేచర్స్ లాంటి అన్నీ ఫీచర్స్ తో మెయిల్ పంపవచ్చు. outlook express లాగే ఉంటుంది. కానీ దానికన్నా అందంగా ఉంటుంది. ఒక సారి ఈ సాఫ్ట్వేర్ వాడి చూడండి. ఇక మీరు వదిలి పెట్టరు. ఇక్కడ క్లిక్ చేసి Incredi mail ఫ్రీ వెర్షన్ ను డౌన్లోడ్ చేస్కోండి.
ఇన్స్టాలేషన్ చేసి ఈ క్రింది విధంగా కన్ఫిగర్ చేయండి.
1. మొదట మీ gmail లోకి లాగిన్ అయి సెట్టింగ్స్ లో Forwarding and POP/IMAP >> Enable POP for all mail కు చెక్ మార్క్ పెట్టి Save Changes ను క్లిక్ చేయండి.
2. Incredi mail సాఫ్ట్వేర్ ను ఓపెన్ చేసి మీ పేరు మీ మెయిల్ ఐడీని ఎంటర్ చేసి Next బటన్ ను క్లిక్ చేయండి. తర్వాత మీ జీమెయిల్ పాస్వర్డ్ ను ఎంటర్ చేసి ఓకే చేయండి. ఇక అందమైన టెంప్లేట్స్ ను ఉపయోగించి మీ ఫ్రెండ్స్ కు మెయిల్స్ పంపేయండి.
Image has been scaled down 7% . Click this bar to view full image (644x562).
బిజినెస్ మెయిల్స్ పంపాలనుకునే వాళ్లు ఇందులోని Letter Creater ద్వారా వాళ్ల బిజినెస్ కు సొంత టెంప్లేట్ తయారు చేస్కోవచ్చు
Image has been scaled down 15% . Click this bar to view full image (702x649).
No comments:
Post a Comment