విషయ సూచిక1 లిప్యంతరీకరణ |
ఇంగ్లీషు (రోమన్) అక్షరాల కీ బోర్డు వాడి వేరే సాఫ్టువేర్ స్థాపించనవసరము లేకుండా తెలుగు టైపు చేసే విధానము. కంప్యూటర్ మరియు అంతర్జాలంలో అన్ని ఉపకరణాలలో మరింత సౌకర్యంగా తెలుగు వాడటానికి కీ బోర్డు వ్యాసం చదివి దానిలోని వివిధ పద్ధతులలో మీకు అనుకూలమైన పద్దతి ఎంచుకోండి. ఇది మొదట్లో విహరిణిలో నడపబడే జావాస్క్రిప్ట్ ద్వారా పనిచేసేది. మే 2012 లో సర్వర్ పై పనిచేసే నరయం అనే మీడియావికీ పొడిగింత ద్వారా పనిచేస్తున్నది.
దీనిలో తెలుగు టైపు చేయడానికి లేక ఇంగ్లీషు మరియు తెలుగు మధ్య మారడానికి కంట్రోల్ మరియు ఎం (Ctrl+M) కీ వాడాలి. ఇంతకు ముందు లాగా ఎస్కేప్ (Esc) కీతో ఇంగ్లీషులోకి మారడం పనిచేయదు (ప్రస్తుతానికి ఇతర వికీ ప్రాజెక్టులలో పాత పద్ధతి కొనసాగుతున్నది). దీనిలో లిప్యంతరీకరణ మరియు ఇన్స్క్రిప్ట్ పద్ధతులు కలవు. ఇన్పుట్ మెథడ్ (Input Method) అని వికీ పేజీ తొలి వరుసలో కనబడే పదం పై మౌజ్ తో నొక్కి కావలసిన పద్ధతి ఎంచుకోవచ్చు. అప్రమేయంగా లిప్యంతరీకరణ పద్దతి చేతనం చేయబడి వుంటుంది. ఒక వేళ ఇలా కనబడకపోతే, మీరు బహుశా విహరిణి (బ్రౌజర్) పాత రూపాంతరం (వర్షన్) వాడుతుండి వచ్చు. తాజా(ఫైర్ఫాక్స్ 10 ఆ పై రూపాంతరాలు మరియు ఇతరాలు) స్థాపించుకొంటే సమస్య వుండదు.
ఇది రైస్ ట్రాంస్లిటరేషన్ స్టాండర్డ్ ఫై ఆధారబడినది.
అక్షరమాల
a | A = aa = aaa | i | I = ee = ii = ia | u | oo = uu = U = ua | R | Ru | ~l | ~L |
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఌ | ౡ |
e | ea = ae = E | ai | o | oe = O = oa | au = ou | ||||
ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ |
ka | kha = Ka = Kha | g | gha = Ga = Gha | ~m |
క | ఖ | గ | ఘ | ఙ |
ca = cha | Ca = Cha | ja | jha = Ja = Jha | ~na |
చ | ఛ | జ | ఝ | ఞ |
Ta | Tha | Da | Dha | Na = nha |
ట | ఠ | డ | ఢ | ణ |
ta | tha | da | dha | na |
త | థ | ద | ధ | న |
pa | fa = Pa = pha = Pha | ba | bha = Ba = Bha | ma |
ప | ఫ | బ | భ | మ |
ya | ra | la | va = wa | Sa | sha | sa | ha | La = lha = Lha | xa = ksha | ~ra |
య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | క్ష | ఱ |
ప్రత్యేక అక్షరాలు
- ఌ = ~l
- ౡ = ~L
- అరసున్నా (ఁ) = @M
- సున్నా = M
- విసర్గ (ః) = @h
- అవగ్రహ (సంస్కృతం) = @2
- నకార పొల్లు = @n
- ఖాళీ స్పేసు = _ (అండర్‌స్కోర్)
- కలుపు నిరోధించు(ZWJ(0x200C) దీని ఇంగ్లీషు అర్థానికి (zero width joiner) కు భిన్నమైన
- వాడుక అంటే గ్లిఫ్ లు కలవకుండా చేయు : ఉదా:క్ష్ లో క్ష్ గా రాయుటకు ksh& ఇది వచ్చినపుడు ఓపెన్ టైప్ లో జిసబ్ అనే మార్పులు నిలిపివేయబడతాయి)= & [
- శూన్యవెడల్పువిడదీయు(ZWNJ (0x200D) పారిభాషికపదాలలో వత్తులువచ్చినపుడు విడదీయటకు ) = ^
- చాప లోని చ = ~c (యూనీకోడ్ వచ్చే వర్షన్‌లో)
- జాము రాతిరి లోని జ = ~j (యూనీకోడ్ వచ్చే వర్షన్‌లో)
కొన్ని ఉదాహరణలు
dESa bhAshalaMdu telugu lessa - దేశ భాషలందు తెలుగు లెస్స
telugulO vrAyaDam ippuDu kashTaM kAdu - తెలుగులో వ్రాయడం ఇప్పుడు కష్టం కాదు
viSvadAbhirAma vinuravEma - విశ్వదాభిరామ వినురవేమ
SrI madbhagavadgIta tatvavivEcanI vyAkhya - శ్రీ మద్భగవద్గీత తత్వవివేచనీ వ్యాఖ్య
fair^fAks veb^braujar - ఫైర్‌ఫాక్స్ వెబ్‌బ్రౌజర్
yAvatprapancAnikI cATiceppanDi. - యావత్ప్రపంచానికీ చాటిచెప్పండి.
కొన్ని క్లిష్టమైన పదాలు
- విజ్ఞానము vij~nAnamu
- రామ్ rAm
- ఫైర్‌ఫాక్స్ fair^faaks
- హోమ్‌పేజీ hOm^pEjI
- ఎంజైమ్ eMjaim
- ఆన్‌లైన్ An^lain
- లిమ్కా limkA
- ఎక్స్‌ప్లోరర్ eks^plOrar
- వ్యాఖ్యానం vyAkhyAnaM
- అనిశ్చితి aniSciti
- దుఃఖసాగరం du@hkhasaagaram
- తెలుఁగు telu@Mgu
- ఆమ్లం aamlaM లేదా AmlaM
- పాన్పు paan&pu
ఇన్స్క్రిప్ట్
- చూడండి ఇన్స్క్రిప్ట్
No comments:
Post a Comment