పైన చూపిన విధంగా రంగుల తొ ఉన్న ఒక బొమ్మను బ్లాక్ అండ్ వైట్ గా చేసి ఒక భాగానికి మాత్రమే కలర్ టింట్ ఇవ్వటం ఎలాగో ఇపుడు చూద్దాం.
నేను ఈ ట్యుటోరియల్ కు ఎంచుకున్న ఇమేజ్ ఇది
ముందుగా మనము అలా చేయాలనుకున్న బొమ్మను ఫొటోషాప్ లో ఓపెన్ చేయాలి. నేను ఎంచుకున్న బొమ్మని అడోబ్ ఫొటోషాప్ 7 లో ఓపెన్ చేశాను. తర్వాత దానిని ఎడిట్ మెనూ లోకి వెళ్ళి ట్రాన్స్ ఫార్మ్ ఆప్షన్ ద్వారా flip Horizontal ఎంచుకుని క్లిక్ చేయాలి. అపుడు ఇమేజ్ హారిజాంటల్ గా ఆపోజిట్ సైడ్ కు తిరుగుతుంది.
ఆ తర్వాత ఇమేజ్ ని బ్లాక్ అండ్ వైట్ గా మార్చాలి. దానికి Image>Adjustments>Black & White లేదా Image>Adjustments>Desaturate ను ఎంచుకుని దానిని బ్లాక్ అండ్ వైట్ గా మార్చాలి.
తర్వాత మనం ఎక్కడైతే మనం కలర్ ఇవ్వాలని అనుకున్నామో దానిని సెలెక్ట్ చేసుకోవాలి. దానికి గాను మనం ఎడ్జెస్ ను కనిపెట్టి దానికి అనుగుణంగా సెలెక్ట్ చేసుకుంటూ పోయే Magnetic Lasso అనే సెలెక్షన్ టూల్ ని ఉపయోగించాలి. రెండు పాయింట్ లు కలవగానే టూల్ చివర సున్నా లాగా కనపడుతుంది. అపుడు క్లిక్ చేస్తే మన సెలెక్షన్ పూర్తయి సెలెక్ట్ అయినంతవరకు చుట్టూతా డాటెడ్ లైన్ కనపడుతుంది. ఇంకా కొంతభాగం అదనంగా సెలెక్షన్ చేయాలంటే షిఫ్ట్ కీ ని పట్టుకుని మరల అలానే సెలెక్షన్ చేయాలి. షిఫ్ట్ కీ పట్టుకన్నతర్వాత Lasso చివర ప్లస్ గర్తు వసచ్చిన తర్వాత అలా చేయాలి. అలాకాకుండా ముందే నొక్కితే ఇంతకు ముందు చేసిన సెలెక్షన్ కాన్సిల్ అవుతుంది. ఒక వేళ కొంతమేర సెలెక్షన్ ను రిమూవ్ చేయాలంటే ఆల్ట్ కీ పట్టుకుని lasso tool ఉపయోగించాలి. ఈ ఉదాహరణలో సెలెక్షన్ వర్క్ పూర్తిచేసిన తర్వాత ఇలా కనపడుతుంది.
ఇపుడు మెనూ నుండి Image>Adjustments>Hue/Saturation ఎంచుకోండి. అపుడు మీకు ఒక డైలాగ్ బాక్స్ స్లైడర్స్ తో కనపడుతుంది. దానిలో క్రింద “Colorize.” అనే దానిని చెక్ చేయండి. అపుడు మీ సెలెక్షన్ ఏరియా red tint లొ కనపడుతుంది.
స్లైడర్స్ ఎడ్జెస్ట్ చేసిన తర్వాత సెలెక్షన్ ను డిసెలెక్ట్ చేసి మనకు కావలసిన ఎఫెక్ట్ రాగానే ఫైల్ మెనూ లోని Save as ఆప్షన్ తో మీకిష్టమైన పాత్ ఇచ్చి దానిని .jpeg గా సేవ్ చేసుకోండి.
అలా సేవ చేసిన ఇమేజ్ చివరకు మనకు ఇలా కనపడుతుంది.
No comments:
Post a Comment