Saturday, 23 June 2012

RSS/Atom ఫీడ్లు ఎందుకు ఉపయోగపడతాయి



RSS/Atom ఫీడ్లు ఎందుకు ఉపయోగపడతాయి?

రోజు మనం బోల్డన్ని సైట్లు చూస్తుంటాం. అలాంటప్పుడు అవన్నీ మనమే తెరుచుకుని కొత్తగా ఏమొచ్చిందో చూడ్డంకంటే, ఆ సైట్లే వాటిల్లో కొత్తగా ఏమన్నా చేర్చినప్పుడు, ఆ చేర్చిన సమాచారం మాత్రమే మనకు అందించేలా ఉంటే బావుంటుంది. ‌RSS/Atom ఫీడ్లు చేసేది ఇదే. అవి ఎలా వాడుకోవాలో చూద్దాం.
 ఫీడు లంకెలు ఎక్కడున్నవి, ఎన్నున్నవనే విషయాలు రెండు విధాలుగా తెలసుకోవచ్చు. మీ విహారిణిలో చిరునామా పెట్టె(అడ్రస్ బార్)లో కుడిచేతి వైపు నారింజ రంగులో ఒక ఐకాన్ కనిపిస్తుంది, అది నొక్కితే ఆ సైటుకి ఎన్ని ఫీడ్లు లభ్యత ఉంటే అన్నీ చూపిస్తుంది. లేదా ఆ సైటు వారే సైటులో ఏదో ఒక చోట ఫీడులంకెలు ఉంచుతారు. టెక్‌సేతుకి మూడు రకాల ఫీడ్లు ఉన్నాయి. మీ విహారిణి చూపించే నారింజరంగు ఫీడు ఐకాన్ మీద నొక్కితే ఆ మూడూ కనిపిస్తాయి. సైటులో పైన ఉన్న పట్టీలో కూడా(కుడివైపు ఉన్న నారింజరంగు బొమ్మ) ఫీడు లంకె ఉంచాము, అయితే సైటులో ప్లేసు సరిగ్గా సరిపోక ఒక్క ఫీడు మాత్రమే పెట్టడం జరిగింది. దాని మీద నొక్కినా సరే మీకు ఫీడు లంకె దొరికినట్టే.
ఈ ఫీడ్లు అనేక రకాలుగా చదువుకోవచ్చు. సరాసరి విహరినిలోనే వాటిని భద్రపరుచుకొని అప్పుడప్పుడు నొక్కి కొత్తగా ఎమొచ్చిందో తెలుసుకోవచ్చు. లేదా, గూగుల్ ఫీడు రీడర్ లాంటి ఉపకరణాన్ని ఉపయోగించుకోవచ్చు. ఫీడు లంకె మీద నొక్కినపుడు, ఆ ఫీడు చదవడానికి గాను, విహారిణి మీకు వివిధరకాల ఆప్షన్లు చూపిస్తుంది. మీ సౌకర్యాన్ని బట్టి అందులోనించి ఒకటి ఎంచుకోండి. ఇక ఏ చింతా లేకుండా సంతోషంగా బోల్డన్ని సైట్లు అందించే సమాచారాన్ని సునాయాసంగా చదువుకోవచ్చు

No comments:

Post a Comment

Blog Archive

Followers

Powered By Blogger