Wednesday, 22 February 2012


ఫాంట్లు అన్నింటిని ఒకేసారి చూపించే సాఫ్ట్వేర్

సహజంగా డీ.టీ.పీ ఆపరేటర్స్ లోగో డిజైనింగ్ కు కోరల్ డ్రా, పేజ్ మేకర్, క్వార్క్ ఎక్స్ప్రెస్, అడోబ్ ఇల్లుస్ట్రేటర్ లాంటి సాఫ్ట్వేర్లుఉపయోగిస్తుంటారు. ఆయా సాఫ్ట్వేర్లలో లోగోడిజైనింగ్ కోసం ఒక పేరు ను టైప్ చేసి ప్రతి ఫాంట్ లో ప్రివ్యూ చూస్తూ వెళ్లిఫాంట్ సెలెక్ట్చేయటం కష్టమైన పనే. అంతే కాక ఎంతో సమయం వృధా కూడా.. 
అలాంటి వారికి ది ఫాంట్ థింగ్ ఎంత గానో ఉపయోగపడుతుంది. ఈ సాఫ్ట్వేర్ ను మీ పేరు ను టైప్ చేస్తే చాలు మీ కంప్యూటర్లో ఉన్న అన్నీ ఫాంట్స్ లో ఒకే సారి ప్రివ్యూ చూసి సెలెక్ట్ చేస్కోగలరు. ఇక్కడే ఫాంట్ సైజ్ ను పెంచి చూడవచ్చు. తర్వాత మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయకుండా వేరే ఫోల్డర్ లో ఉన్న ఫాంట్స్ ను కూడా బ్రౌజ్ చేసి ప్రివ్యూ చూస్కొని, తర్వాత మీకు నచ్చిన ఫాంట్ వరకే install బటన్ నుపయోగించి మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ కూడా చేయవచ్చు.


ఫైల్ to Save ఫోల్డర్ ఎలాగో చుద్దామా?

మనం పేజ్ మేకర్ (7.0 ) ఫైల్లో టెక్ట్స్ను, మ్యాటర్ను, ఇమేజ్లను, రకరకాల ఫాంట్లనువాడతాము.
ఆ ఫైల్ ను మరో సిస్టమ్ లో ఓపెన్ చేసినపుడు మనకి ఆ ఫాంట్స్ ఓపెన్ అవవు.ఇమేజ్ లకు లింకులు ఉండవు. మరిఅవి అన్ని(ఇమేజ్లు, టెక్ట్స్ ఫైల్, ఫాంట్లుమొదలైనవి) ఒకే ఫోల్డర్లో సేవ్ చేసుకుంటే బాగుంటుంది కదా. అది ఎలాగోఇప్పుడుచుద్దామా.


1. మొదటగా మీరు చేసిన ఫైల్ ను ఓపెన్ చేసి మనకు కావలసిన ప్రాసెస్ స్టాట్ చేసేముందు ఒకసారి సేవ్ చేయండి.
2. పైన టూల్స్లో Utilities>Plug-ings>Save for service provider ను క్లిక్ చేయండి.


3. Save for service provider లో Package Option ను సెలక్ట్ చేసుకోండి.



4. మీకు కావలసిన ప్రదేశంలో మీకు కావలసిన పేరుతో New Folder క్రియేట్ చేసుకొని దాన్ని ఓపెన్ చేసుకొని Include అనే చోట Copy Font మరియు All అనే అప్షన్స్ టిక్ చేసి Save చేయండి.



5. Font Alert అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని Ok చేయండి.



6. అంతే మీ ఫైల్ కు సంబంధించిన టెక్ట్ మరియు ఇమేజ్లు మరియు ఫాంట్లు మీరు ఆ ఫైల్లో ఉపయోగించిన అన్ని ఈ ఫోల్డర్ లో సేవ్ అవుతాయి.
7. ఇక మీరు ఈ ఫైల్ ను ఏ సిస్టమ్ లో అయిన ఓపెన్ చేయవచ్చు..

పేజిమేకరులో డాక్యుమెంట్ ని సృష్టించడం (File Menu)

1. Pagemaker ఓపెన్ చేయగానే వచ్చే తెరలో File మీద క్లిక్ చేస్తే వచ్చే మరోమెనూలో New మీద క్లిక్ చేయండి.


2. అపుడు Document Setup కనబడుతుంది. దానిలో ok మీద క్లిక్ చేయండి.మీ ముందు తెల్లని తెర వలెప్రత్యక్షమవుతుంది. మనం అందులోనే డాక్యుమెంట్నిఅక్కడే తయారు చేసుకోవాలి.



3. ఇప్పుడు మీరు తెర ప్రక్కనే వున్న టూల్ బాక్స్లో కనిపించే వాటిలో T (Text కోసం) మీద క్లిక్ చేయండి.
అప్పుడు కర్సర్ నిలువుగా మారుతుంది. దానిని మీకు కన్పించే తెర మీద మొదట్లో క్లిక్ చేస్తే నల్లటి గీత ఏర్పడుతుంది.



4. ఇప్పుడు మీరు ఉదాహరణగా ఏదైనా మీ బయోడెటాను మరెదైనా మ్యాటర్ ను టైప్ చేయండి. ఒక పేజికి చివరికి లైను రాగానే కంప్యూటరు తనంతట తానే తరువాతి లైన్కి కర్సర్ని మళ్ళిస్తుంది. అయితే ఒక పేరా సగం లైన్ లో ముగించి తదుపరి పేరా మీరు టైప్ చేయ్యాలంటే మటుకు ఎంటర్ మీద క్లిక్ చేయ్యాలి.

5. మీరు టైప్ చేసిన డాక్యుమెంట్ బాగా కన్పించడానికి మీరు తెరపై కన్పించే మెనూలోని View మీద క్లిక్ చేయండి., తద్వరా వచ్చే ఉపమెనూలో Actual Size (Ctrl+1) మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీ డాక్యుమెంట్ ఒక ప్రక్కకి ఒరిగిపోతే మీరు టూల్ బాక్స్లో చేతి  గర్తు (Alt) మీద క్లిక్ చేసి, డాక్యుమెంట్ని విండో మధ్యకి జరపుకోవచ్చు.

6. మ్యాటర్ ని టైప్ చేసేసారు కదా. అంతే డాక్యుమెంట్ తయారు అయినట్లే. మరి ఈ డాక్యుమెంట్ని మళ్లి మరెప్పుడైనా కావాలంటే ఎలా. అందుకోసం డాక్యుమెంట్ని Save చేసుకోవాలి. Save చేసుకోవడానికి దానికొక పేరు ఇవ్వాలి. ఉదహరణకు చేసిన డాక్యుమెంట్కి DTP అని పేరు ఇద్దాం. ఫైల్ ని కంప్యూటర్ లో భద్రపరడాన్నే కంప్యూటర్ భాషలో Save అంటారు. అదెలా చేయాలో తెలుసుకుందాం.
తెరమీద కన్పించే File మీద క్లిక్ చేస్తే వచ్చే ఉపమోనూలో Save మీద క్లిక్ చేయండి.


ఫలితంగా మీ ముందు ఈ క్రింది విధంగా ఒక తెర ప్రత్యక్షమవుతుంది. తెరలో File Name అన్న ప్రక్ననే కర్సర్ని ఉంచి DTP అని టైప్ చేయాలి. తరువాత ఆ ప్రక్కనే ఉన్న Save మీద క్లిక్ చేయండి.
అంతే! ఇప్పుడు మీరు సృష్టించిన డాక్యుమెంట్ మీ కంప్యూటర్లో DTP పేరు మీద భద్రంగా ఉండిపోతుంది.



ఆ తర్వాత తెరలోని File మీద క్లిక్ చేసి తదనుగుణంగా వచ్చే Close మీద క్లిక్ చేయండి. మీరు ఆ ఫైలు నుండి బయటకి వచ్చేస్తారు.



తిరిగి ఫైల్ని చూడటం
కొన్ని రోజుల తర్వాత మీరు అంతకు ముందు సృష్టించిన DTP ఫైలుని చూడాలనుకోండి. అప్పుడు తిరిగి Pagemaker లోకి వెళ్ళి File మెనుమీద క్లిక్ చేసి అందులో Open అనే సబ్మెను మీద క్లిక్ చేస్తే ఫలితంగా మీ ముందు ఈ క్రింది తెర కన్పిస్తుంది.




ఫై తెరలో మీరు DTP ఫైలుని ఎక్కడ సేవ్ చేశారో అక్కడికి వెళ్ళి DTP ఫైల్ మీద కర్సర్ని ఉంచి డబుల్ క్లిక్(రెండుసార్లు క్లిక్) చేయండి. వెంటనే ఈ ఫైలు మీముందు ప్రత్యక్షమవుతుంది.

Recent Publications
ఇటీవలనే సృష్టించిన లేదా పనిచేసిన ఫైళ్ళని చూడటానికి లేదా ఓపెన్ చేయడానికి దీనిని ఉపయోగిస్తారు. మీరు మీ కంప్యూటర్లో File>Recent Publications మీద క్లిక్ చేసి చూడండి.


Document Setup
టెక్ట్స్ ని తీసుకోవడానికి మనం ఎన్ని పేజీలు కావాలో, ఎంత సైజు కావాలో లాంటి వాటిని నిర్దేశించేదే ఈ Document Setup మనం వర్క్ చేసే ముందు దీనిమీద క్లిక్ చేయాలి.



సాధారణంగా మనం బుక్వర్క్ చేస్తున్నప్పుడు సుమారుగా ఇన్ని పేజీలు కావాలని పేర్కొనాల్సి వస్తుంది. అదే గ్రీటింగ్ కార్డులు, విజిటింగ్ కార్డుల వంటి వాటిని సైజులు CM లలో సృష్టంగా పేర్కొనాలి. అలా టైప్ చేయబోయే పేజీ పరిమాణం, కుడి ఎడమల గ్యాప్ లు సర్దుబాటు చేయడానికి ఈ Document Setup ఉపయోగపడుతుంది.

Place Command
మన కంప్యూటర్ లో కేవలం పేజిమేకర్ లోనే పని చెయ్యం. ఇతర ప్యాకేజీల్లోనూ పని చేస్తాం. అందులో సృష్టంచిన ఫైళ్ళు ఒక్కొసారి మనకు పేజిమేకర్ లో వాడుకోవడానికి అవసరం కావచ్చు. ఈ నేపధ్యంలో అలా వాడుకోవడానికి మనకు లభ్యమయ్యే అవకాశమే ఈ Place కమాండ్. ఈ కమాండ్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ క్రింది విధంగా వచ్చే బాక్స్లో అన్ని ప్యాకేజిలలో ఉండే ఫైల్సు కనిపిస్తాయి.



మీకు కావల్సిన ఫైలుని ఎన్నుకొని Open క్లిక్ చేస్తే ఈ ఫైల్ను పేజిమేకర్ లోకి దిగుమతి చేసుకోవచ్చు.

Links Command
ఇతర ప్యాకేజీల్లోని లింక్ చేయబడ్డ ఈ కమాండ్ గురించి ఎక్కవ వివరణ అవసరం లేదు. ఈ Links కమాండ్ని ఉపయోగించాలంటే పేజిమేకర్ లో మనం చాలా హెచ్చుస్థాయి పరిగ్జ్నానం ఉండాలి.

Preferences Command
ఇది మనకు పేజిమేకర్ లో అంతగా అవసరం లేదు.

Print
మనం చేసిన డాక్యుమెంట్ ని ప్రింట్ రూపంలో చూసుకోవడానికి ఈ Print కమాండ్ ఉపయోగపడుతుంది. దీని కోసం “పేజీలను ప్రింట్ చేయడం” అనే ట్యూటోరియల్ ను చూడండి.

Exit (Ctrl+q)
పేజిమేకర్ లో నుండి మనం బయటకు రావడానికి ఈ కమాండ్ని ఉపయోగిస్తాం. ఇక్కడ Close(Ctrl+W) కమాండ్కి, Exit కమాండ్కి తేడాని గమనించాలి. Close కమాండ్ కేవలం పేజిమేకర్ డాక్యుమెంట్ (ఫైల్) మాత్రమే క్లోజ్ అవుతుంది. Exit కమాండ్ని ఉపయోగించడం వల్ల మొత్తం పేజిమేకర్ నుండి బయటకు వస్తాం.

ఫేజిమేకర్ తెరలోని వివిధ పరికరాలు – వాటి వివరణ

ఇంతకుముందు మనం కేవలం టెక్స్ట్ ని మాత్రమే పేజిమేకర్ లోకి తీసుకోవడంతెలుసుకున్నా. అయితే పేజిమేకర్ లోకొన్ని రకాల లైనులు, బాక్స్లు, నక్షత్రాకారడిజైనులను సృష్టించాల్సి ఉంటుంది. పేజిమేకర్లో రకరకాల గీతలను, బాక్స్లనుసృష్టించడానికి మనకోసం రెడిమేడ్ పరికరాలు ఉంటాయి. వాటి ఆధారంతో వాటినితేలికగా సృష్టించవచ్చు.

ఇప్పుడు అలాంటివాటిని ఎలా తయారుచేయాలో చూద్దాం.
పేజిమేకర్లో రకరకాల గీతలు, బాక్స్లు ఉన్న వాటిని గీయడానికి Tool Box అనేపరికరల సముదాయం
 
ఉంటుంది. పేజిమేకర్ ని తెరువగానే తెరమీద ఈ Tool Box ఉంటుంది. ఒకవేళ మీకు కనిపించకపోతే Window మెనూ మీద క్లిక్ చేసి తద్వారా వచ్చే మెనూలో Show Tool Box మీత క్లిక్ చేస్తే ఈ Tool Box మెరుపు వేగంతో తెరమీద ప్రత్యక్షమవుతుంది.


ఇప్పుడు  Tool Box లో  క్రింది విధంగా రకరకాల సదుపాయాలుఉంటాయి.


అందులో ఒకోదాని గురించి తెలుసుకుందాం.


 పాయింటర్ టూల్ (సెలక్స్ చేయడం)
పేజిమేకర్ లో టెక్స్ట్ తో, బొమ్మలతో, బాక్స్ లతో ఎప్పుడూ పని ఉంటుంది. ఆ బొమ్మలను, బాక్స్లను సెలక్స్ చేయాలన్నా, ఒకచోటు నుండి మరోచోటుకు తీసుకువెళ్ళాలన్నా పాయింట్ టూల్ సహాయం అవసరం. ఈ టూల్ మీద క్లిక్ చేసి, ఆ తర్వాత సంబంధిత బాక్స్ లేదా బొమ్మలతో పని ప్రారంభించాలి.


 టెక్స్ట్ టూల్
ఇక్కడ T అంటే టెక్స్ట్ అని అర్ధం. టూల్ బాక్స్ లో టెక్స్ట్ ని టైప్ చేయాలంటే ముందుగా టూల్ బాక్స్లోని ఈ  మీద క్లిక్ చేసి, ఆ తర్వాత మౌస్ ని సంబంధిత డాక్యుమెంట్ మీద ఉంచి టైప్ చేయడం ప్రారంభించాలి. ఈ టెక్స్ట్ టూల్ ద్వారా టెక్స్ట్ ని టైప్ చేయడమే కాక టెక్స్ట్ ని సెలక్స్ చేయడం, ఎడిట్ (మార్పులు, చేర్పులు చేయడం) కూడా చేయవచ్చు.

 Rotate టూల్
బొమ్మలను ప్రక్కకు, పైకి క్రిందికి ఎటువేపున్నా తిప్పడానికి rotate tool ఉపయోగపడుతుంది. అదెలాగో చూద్దాం.
ఒక బాక్స్ ని సృష్టించి దానిని సెలక్స్ చేయండి. ఆ తర్వాత Rotate toolని ఎంచుకొని మౌస్ తో ఆ బాక్స్ని నొక్కిపెట్టి కావాల్సిన కోణంలోకి లాగాలి. అలా కోరుకున్న కోణంలోకి వచ్చాక మౌస్ బటన్ ని వదిలేయ్యాలి.
కేవలం Tool Box లోని Rotate toolతో మాత్రమే కాకుండా Control Palette ద్వారా కూడా బొమ్మ లేదా మ్యాటర్ ని అటు ఇటూ తిప్పవచ్చు. అయితే Control Palette ద్వారా Rotate toolని ఆపరేట్ చేసేటపుడు మనకు ఖచ్చితంగా ఎంత శాతం తిప్పాలో పర్సంటేజి తెలుసుండాలి.

 Cropping టూల్
మనకు కావాల్సిన బొమ్మల సైజు సరిచేయడానికి ఈ tool సహాయపడుతుంది. ఉదాహారణకి బొమ్మలలో ఏదో ఒక భాగం కొద్దిగా అవసరం లేదనుకోండి. మనం ఈ tool ని ఉపయోగించి అక్కర్లేని భాగాన్ని కన్నించకుండా చేయవచ్చు.
ఈ Cropping టూల్ని ఉపయోగించేటపుడు బొమ్మని సెలక్స్ చేసినపుడు ఏర్పడే నల్లటి చుక్కల మీద కర్సర్ ని ఉంచి డ్రాగ్ చేయాలి. ఏవైపు తగ్గించాలంటే ఆ వైపు ఉన్ నల్లటి చుక్కమీద మౌస్ ఉంచి నొక్కిపెట్టి బొమ్మమీదకు లాగాలి. అప్పుడు బొమ్మలోని ఆవైపు భాగం కుదించుకుపోతుంది. ప్రాక్టీసు ద్వారా దీనిని వివరంగా తెలుసుకోవచ్చు.

 సూటిగా గీతలు (Straight Lines) గీయండం (Line Tool)
కేవలం టెక్స్ట్ నే కాకుండా మన డాక్యుమెంట్లో ఒకోసారి స్ర్టెయిట్ లైన్ గీతలు అవసరమవుతాయి. అందుకోసం టూల్ బాక్స్లోని మీద క్లిక్ చేసి డాక్యుమెంట్మీద కర్సర్ని ఉంచి మౌస్ నొక్కి పెట్టి గీతలు గీయవచ్చు.

 పై నుండి క్రిందికి గీతలు గీయడం (Rule Tool)
కేవలం సమతల గీతలే కాకుండా తెరమీద పైనుండి కిందికి సైతం గీతలు గీయాల్సి ఉంటుంది. అందుకోసం Tool Boxలోని మీద క్లిక్ చేసి ఆ తర్వాత కర్సర్ని డాక్యుమెంట్ మీద ఉంచి పై నుండి కిందకి మౌస్తో నొక్కి పెట్టి గీయవచ్చు.

 బాక్స్లు గీయడం (Boxes)
ముందుగా బాక్స్లు గీయడానికి ఏం చెయ్యాలో చూద్దాం. మీ మౌస్ని Tool Box లోని Bos Shape మీద క్లిక్ చేసి, ఆ తర్వాత మౌస్ని నొక్కిపెట్టి డాక్యుమెంట్ మీద ఒక చివర నుండి ఇంకో చివర వరకూ డ్రాగ్ (నొక్కిపెట్టి) చేసి వదలండి. మీకు బాక్స్ తయారవుతుంది.

 గుండ్రటి బాక్స్లను గీయడం (Ellipses)
దీని కోసం Tool Boxలోని మీద క్లిక్ చేసి, పైన వివరించినట్లుగానే మౌస్ని నొక్కిపెట్టి వదలండి. గుండ్రటి బాక్స్ తయారవుతుంది.

 పాలిగాన్ని గీయడం (Draw Ploygons)
పైన తెలుసుకున్న బాక్స్లు కాకుండా, రకరకాల యాంగిల్స్ గల బాక్స్ లు సృష్టించాలంటే ఈ polygon ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. దీని మీద డబల్ క్లిక్ (రెండు సార్లు) చేస్తే polygon setting అనే డైలాగ్ బాక్స్ ప్రత్యక్షమవుతుంది.

పై బాక్స్లో బాక్స్ కి ఎన్ని పక్కలు (సైడ్)లు కావాలో తెలియజేసి, OK మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీకు star shape కావాలంటే Star Inset బాక్స్లో మీకు కావలసినంత Value ఇచ్చి OK మీద క్లిక్ చేస్తే కావల్సిన polygon బాక్స్ తయారవుతుంది.

 పైద్దదిగా చూడటం (Zoom Tool)
తెరమీద టెక్స్ట్ ని, బొమ్మలను మన కంటికి తగినట్లుగా ఎన్నో రెట్లు (400 శాతం వరకు) పెద్దదిగా చూడటానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే అదే మ్యాటర్ ని చిన్నదిగా చేయడానికి కూడా ఈ టూల్ ఉపయోగపడుతుంది.

డాక్యుమెంట్లో మార్పులు, చేర్పులు చేయ్యడం (Edit Menu)

మీరు ఓ లెటర్ / డాక్యుమెంట్ ని సృష్టించారు. దానిలో ఒక చోట Spellingమర్చాలన్నా లేదా అనవసరం అనిపించినలైన్స్ తీసేయాలన్నా, మరోచోట మ్యాటర్ నికలపాలన్నా, మొత్తం డాక్యుమెంట్లో ఉన్న మిస్టేక్ లను సరిదిద్దాలన్నా ఈఎడిట్ మెనూఉపయోగపడుతుంది.

టెక్స్ట్ ని ఎలా సెలక్ట్ చేయాలంటే
  • టెక్స్ట్ మీద క్లిక్ చేసి, మౌస్తో డ్రాగ్ చేయడం.
  • టెక్స్ట్ మొదట కర్సర్తో క్లిక్ చేసి, కర్సర్ ద్వారా వెలువడే I-బీమ్ మార్క్ను టెక్స్ట్ముగిసే చోట ఉంచి Shift నినొక్కడం ఒక పదం మీద కర్సర్ యొక్క I-బీమ్ను ఉంచి, ఆ పదాన్ని డబుల్ క్లిక్ (రెండు సార్లు) చేయడం
  • ఒక పేరా మీద కర్సర్ యొక్క I-బీమ్ను ఉంచి మూడుసార్లు క్లిక్ చేయడం.

టెక్స్ ని కలపడం (Adding Text)
డాక్యుమెంట్ లో కొంత సమాచారాన్ని అదనంగా కలపాలనుకోండి. అప్పుడు కర్సర్ ని ఎక్కడ సమాచారం కావాలో అక్కడ ఉంచి టైప్ చేయడం ప్రారంభించాలి. ఉదాహరణకు ఏదైనా చేసిన ఫైల్ ని ఓపెన్ చేయండి. అందులో పేరా తరువాత ఉదాహరణకు Edit Menu Tutorial ను కలపాలనుకోండి. అప్పడు మొదటి పేరా ఆఖరి వాక్యం తర్వాత కర్సర్ ను ఉంచి పై వాక్యాన్ని టైప్ చెయ్యాలి. టైప్ చెయ్యడం మొదలు పెట్టగానే కంప్యూటర్లో ఆటోమాటిక్గా క్రింది పేరాలు తమ స్థానాన్ని తదనుగుణంగా మార్చుకుంటాయి.
అయితే మీరు టైప్ చేసేముందు Tool Box లోని టెక్స్ట్ టూల్ మీద క్లిక్ చేసి ఆ తర్వాత టైప్ చేయడం ప్రారంభించాలి.

టెక్స్ట్ ని తొలగించడం (Delete)
వాక్యంలో ఒక పదాన్ని గాని పదాలను గాని తొలగించాలనుకుంటే మనకు రెండు అవకాశాలు ఉన్నాయి. అందులో
1. ఏ పదాన్నయితే తొలగించాలనుకున్నారో ఆ పదం ముందు కర్సర్ను ఉంచి Delete Keyని క్లిక్ చేస్తూ పోతే కర్సర్ ప్రక్క ఉన్న అక్షరాలు, Back Space Key క్లిక్ చేస్తే కర్సర్ ముందు ఉన్న అక్షరాలు డిలీట్ అవుతూ ఉంటాయి.
2. కర్సర్ ను మ్యాటర్ లో మనకు ఎక్కడనుంచి అక్కర్లేదో అక్కడ టెక్స్ట్ టూల్తో క్లిక్ చేసి తరువాత ఎక్కడ వరకు అక్కర్లేదో అక్కడ Shift పట్టుకుని టెక్స్ట్ టూల్తో క్లిక్ చేసి Delete క్లిక్ చేస్తే సెలక్స్ అయిన మాటర్ మొత్తం డిలీట్ అయిపోతుంది.

Undo
ఫైలు మెనూలోని Edit మీద క్లిక్ చేస్తే వచ్చే ఉపమెనూలో ఈ Undo ఉంటుంది. పొరబాటున మనం ఒక వాక్యం లేదా పేరాని తొలగిస్తే తిరిగి పొందడానికి ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. అయితే పొరబాటు చేసిన వెంటన్ ఈ Undo బటన్ క్లిక్ చేయాలి. అంతేకాని చాలా పనులు, ఆప్షన్లు క్లిక్ చేశాక ఈ Undo ఆప్షను వాడితే పని చేయదు.

Cut
ఒకోసారి మనం కొంత సమాచారాన్ని ఒక డాక్యుమెంట్ని నుంచి మరో డాక్యుమెంట్లోకి తీసుకెళ్ళాల్సి ఉంటుంది. మ్యాటర్ ని సెలక్స్ చేసి ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే, ఆ మ్యాటర్ అసలు డాక్యుమెంట్లో నుండి తొలగింపబడుతుంది. ఇలా ఒక మ్యాటర్ ని అక్కడ తొలగించి వేరు డాక్యుమెంట్ కోసం తీసుకెళ్ళాల్సి వచ్చినపుడు ఈ ఆప్షన్ నొక్కితే చాలు.

Paste
ఇంతకు ముందు మీరు పాత డాక్యుమెంట్లోని కొద్ది సమాచారాన్ని కట్ చేశారు కదా! ఇప్పుడు దానిని వేరు డాక్యుమెంట్లోకి అతికించాల్సి వచ్చినపుడు కర్సర్ ను మీరు కట్ చేసిన మ్యాటర్ ఎక్కడ కావాలో ఉంచి Edit మెనూలోని Paste మీద క్లిక్ చేయడం ద్వారా చేయవచ్చు.

Select all
ఒక వేళ మొత్తం టెక్స్ట్ ని సెలక్స్ చేయాలంటే మటుకు Select all (Ctrl+A) మీద క్లిక్ చేయాలి.

Deselect all
సెలెక్ట్ చేసిన తర్వాత మీరు మనసు మార్చుకొని సెలక్స్ వద్దనుకుంటే Deselect all మీద క్లిక్ చేయడం ద్వారా హైలెట్ ని రద్దు చేయవచ్చు.

Multiple Paste
ఇంతకు ముందు చెప్పిన Paste ఆప్షన్ ద్వారా మీకు కొంత సమాచారం లేదా బొమ్మ లేదా బాక్స్ సృష్టించగలరు. అలాంటి బొమ్మలనే అనేకం సృష్టించాలంటే ఈ Multiple Paste ఆప్షన్ ద్వారా సృష్టించగలం.
ఇప్పుడ ఈ Multiple Paste ద్వారా మ్యాటర్ ని అనేకసార్లు ఎలా సృష్టించాలో చూద్దాం.
ముందుగా కావాల్సిన సమాచారాన్ని సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత మెనూలోని Copyని ఎన్నుకోండి. అప్పుడు Edit మెనూలోనే ఉన్న Multiple Pasteని ఎన్నకోండి. పలితంగా మీ ముందు ఓ డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.


పై బాక్స్లో మీకెన్ని కాపీలు కావాలో సంఖ్య (ఉదాహరణకు 5) వేయండి. ఆ తర్వాత క్లిక్ చేయండి. ఫలితంగా మీ ముందు ఈ క్రింది విధంగా డాక్యుమెంట్లో ఐదుసార్లు అదే మ్యాటర్ ప్రింట్ అవుతుంది.

Thanking You
Thanking You
Thanking You
Thanking You
Thanking You

కేవలం సమాచారమే కాకుండా బొమ్మలు, బాక్స్లను కూడా పై విధంగా కాపీ చేయవచ్చు.

Insert Object
లోని మీద క్లిక్ చేస్తే ఫలితంగా మీ ముందు ఈ క్రింది తెర కనిపిస్తుంది.
వివిధ సాఫ్ట్వేర్లలో చేసిన ఫైల్స్ను పేజిమేకర్లో ఉపయోగించుకోవడానికి ఈ తెరలోని ఉన్న ఆప్షన్లలో ఆ ఫైల్ యొక్క సాఫ్ట్వేర్ను సెలెక్సట్ చేసుకోని Ok చేస్తే ఈ ఫైల్స్ ఓపెన్ అవుతుంది. ఆ ఫైల్లో మనకు కావలసిన విధంగా తయారుచేసుకోని Close చేస్తే ఈ ఫైల్ పేజిమేకర్ ఫైల్ లోకి వచ్చేస్తుంది.


Edit Story and Edit Original
పేజిమేకర్లోని చిన్న స్ర్కీన్ మీద మీకు అన్నిరకాల తప్పులను సవరించడం, మ్యాటర్ని కలపడం రాకపోవచ్చు. మామూలు పేజిలో అన్ని మార్పలు చేసుకోవడానికి ఇరుకుగా ఉండవచ్చు. అలాంటపుడు మన మ్యాటర్ని విశాలంగా ఉన్న మరో పెద్ద స్ర్కీన్లోకి తీసుకెళ్ళడానికి మనకు ఉపకరించేదే ఈ Edit Story ఆప్షన్. ముందుగా మీరు Edit>Edit Story మీద క్లిక్ చేస్తే నేరుగా ఒక పెద్ద స్ర్కీన్ ఉన్న డాక్యుమెంట్లోని అడుగుపెడతారు. అక్కడ మీ డాక్యుమెంట్లోని అన్ని రకాల మార్పులను చేసుకోవచ్చు. అక్కడ్నుంచి తిరిగి మామూలు తెరమీదకు రావాలంటే మటుకు Edit>Edit Original మీద క్లిక్ చేస్తే సరిపోతుంది.

పేజిమేకర్ అక్షరాలను ఆకర్షణాయంగా తీర్చిదిద్దడం (Type Menu)

ఈ మెనూ ద్వారా ఉన్న అక్షరాలను (ఫాంట్)ని మార్చేయడం, చిన్న అక్షరాలనుపెద్దవిగా చేయడం, అద్బుత అక్షణాలతోడాక్యుమెంట్ని ఇంకా అందంగా తీర్చిదిద్దవచ్చు.

ఫాంట్ ఆదేశం (Font Command)
పేజిమేకర్ లో Type మెనూలో Font ని క్లిక్ చేయగానే రకరకాల ఫాంట్లు మీకళ్ళముందు ప్రత్యక్షమవుతాయి. 


కావాల్సిన సమాచారాన్ని సెలక్ట్ చేసుకుని వాటిలో మీకు ఇప్టం వచ్చిన ఫాంట్ను ఎన్నకోవచ్చు.

సైజు (Size Command)
కేవలం రకరకాల అకృతులు ఉన్న ఫాంట్లే కాకుండా వాటి సైజు సైతం మనం మార్చుకోవచ్చు. మీరు పుస్తకాలలో పేరాగ్రాఫ్లు కొన్ని పెద్దవిగా, మరికొన్ని చిన్నవిగా ఉంటాయి. ఇక్కడ ఫాంట్ సైజులను రకరకాల సంఖ్యలో కొలుస్తారు. Type>Size ని క్లిక్ చేయడం ద్వారా ఎన్నుకోవచ్చు. ఉదాహరణకు క్రింద చూడండి.
ఈ ఫాంట్ సైజులు, ఆకృతులను మనం Control Palette లోని బాక్స్ ద్వారా కూడా ఎన్నుకోవచ్చు.


Leading
లైనుల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశాన్ని Leading అంటారు. పేజిమేకర్లో అక్షరం అక్షరం మధ్య ఖాళీని పెంచవచ్చు. తగ్గించవచ్చు. ఈ Leading ఆప్షన్ని ఉపయోగించి ఒక పేజిలో ఖాళీని బట్టి మ్యాటర్ని పెంచవచ్చు. ఒక పేజికి సాధారణంగా 33 లైనులు పడుతాయి. అయితే మనకు 35 లైనులు కావాలనుకోండి. అలాంటపుడు ఒక అక్షరం మరో అక్షరం మధ్య గాప్ను తగ్గించి 35 లైనులు వచ్చేలా చేయవచ్చు. దీనికోసం Leading ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా కనిపించే వాటిలో సైజు ఎన్నుకొని లీడింగ్ పెంచవచ్చు, తగ్గించవచ్చు.
ఉదాహరణకు ఒక్కో సైజు ఎంతంత పరిమాణంలో వస్తుందో చూడండి.

పై బాక్సులో మీకు కావాల్సిన Font పేరు, Font Size, Leading, కలర్స్ లాంటి వాటిని ఎన్నుకొని OK క్లిక్ చేస్తే సరిపోతుంది.

కెర్నింగ్
కొన్ని పదాలు లేక అక్షరాలు ఎక్కువగా పొడవు సాగి ఉంటాయి. అంటే అక్షరాల మద్యన అవి ఎక్కువ స్థానాన్ని తీసుకుంటాయి. అలాంటి వాటిని సరిచేయటానికి పేజిమేకర్లో కెర్నింగ్ ఆప్షన్ వాడతాము.
ఉదాహరణకు క్రింద చూడండి.


Tracking
ఒకో పదం లేదా వాక్యాల మధ్యన ఉన్న గ్యాప్ని సమాంతరం చేయడానికి ప్రక్రియి ఉపయోగిస్తారు. కెర్నింగ్ని రెండు అక్షరాల మధ్య గ్యాప్ ని సమాంతరం చేయడానికి చేయడానికి ఉపయోగిస్తారు.

Alignment (సమాచారాన్ని సర్దుబాటు చేయడం)
అక్షరాలతో పాటు మన డాక్యుమెంట్లోని పేరాలన కూడా పొందికగా అమర్చుకోవడానికి మనకు సాధ్యమయ్యే సాధనాన్ని అలైన్మెంట్ అంటారు. పేరాగ్రాఫ్లను మన అభిరుచికి తగినట్లుగా కుడి, ఎడమ, మధ్యలకు మార్చుకోవచ్చు.
Shortcuts
Left = Shift+Ctl+L
Right = Shift+Ctl+R
Center = Shift+Ctl+C
Justify = Shift+Ctl+J

కావాలసిన మ్యాటర్ను సెలక్ట్ చేసి ఈ ఆప్షన్ను ఉపయోగించండి.

పారాగ్రాఫ్ స్పెసిఫికేషన్
మనం టెక్ట్స్ ని టైప్ చేసేటుపుడు ప్రతి పేరాగ్రాఫ్కి ఓ హెడ్డింగ్ని ఉంచుతాం. ఉదాహరణకు ఈ క్రింది మ్యాటర్ను గమనించండి.


ఈ హెడ్డింగ్కి, దాని క్రింది మ్యాటర్కి మధ్య ఎంత గ్యాప్ ఉండాలో అనే దానికి మనం ని ఉపయోగించి చూడాలి. దీనిలో ఎడమవైపు స్థలం ఎంత దానిలో మీకు కావల్సిన స్థలం (2 సం. ఎం. లేదా 3 ఎం. ఎం.) ఇవ్వండి. వెంటనే ఆ స్థలం దాని గ్యాప్ తదనుగుణంగా మారిపోతుంది.

Indents / Tbas

 
పై మ్యాటర్ మధ్య ఖాళీలు సరిగ్గా అంతే విధంగా రావాలంటే మనం చాలా శ్రమించాల్సి ఉంటుంది. ఒక కాలమ్కి మరో కాలమ్కి మధ్య అంతే గ్యాప్ని ఉంచాలంటే ప్రతిసారి కర్సర్ని అక్కడ ఉంచి టైప్ చేయాల్సి ఉంటుంది. అయినా అవి సరైన వరుసలో రాకపోవచ్చు. ఈ నేపధ్యంలో ఆయా వరసల మద్య గ్యాప్ని సమతుల్యంలో ఉంచడానికి మనకు ఉపయోగపడే ఆప్షన్ పేరే Indents / Tab.
మీరు ఇలా చేయడం కోసం మీకు గ్యాప్ కావలసిన చోట ప్రెస్ చేసి టైప్ చేయండి. తర్వాత మెనూబార్లోని Type>Indents/Tab మీద క్లిక్ చేస్తే ట్యాబ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. మనం ట్యాబ్ ఇచ్చిన చోట విధంగా ఉంటుంది. దానిని జరుపుతూ గ్యాప్ ను పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు.

ట్యాబ్ సెట్టింగ్ గురించి పూర్తిగా వివరాలు తెలుసుకోవడానికి క్రింది లింక్ క్లిక్ చేయండి.

పేజిమేకర్లో మ్యాటర్ను పేజీలలో సెట్ చేయడం ఎలాగో తెలుసుకుందాం?

పేజిముకర్లో పేజీలను సెట్ చేసుకున్న తరువాత మ్యాటర్ను ఆ పేజీలలో సెట్ చేయడంఇప్పుడు తెలుసుకుందాం.
1). మ్యాటర్ పేజి లోపలి భాగం దాటినపుడు క్రింద విధంగా ఉంటుంది. 
2). సెలక్షన్ టూల్తో మ్యాటర్ లేయర్ మధ్య భాగానా క్లిక్ చేసి పట్టుకుని పేజిలో చివరి భాగం వరకు కాని లేదా మీకు ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు జరపండి.


3). అపుడు సెలక్ట్ చేసిన భాగం మధ్యలో రెడ్ కలర్లోకి మారుతుంది.


4). సెలక్షన్ టూల్తో ఆ రెడ్ కలర్ మీద క్లిక్ చేసి తరువాతి పేజి మొదటి భాగంలో క్లిక్ చేస్తే మొదటి పేజిలోని తరువాతి మ్యాటర్ ఆ పేజిలోకి వస్తుంది.


5). అలా కాకుండా మొదటి పేజిలో కొన్ని వందల లైన్లు ఉన్నాయనుకోండి అప్పుడు Layout>Autoflow ఆప్షన్ క్లిక్ చేసి మ్యాటర్ను తరువాత పేజిలో ఇన్సర్ట్ చేస్తే మ్యాటర్ ఎన్ని పేజీలకు సరిపోతుందో అన్ని పేజీలు ఆటోమేటిక్ గా సెట్ అవుతాయి.
 

పేజిమేకర్లో Text వ్రాప్ గురించి తెలుసుకుందాం

మనం తయారు చేసే పేజీలో మ్యాటర్, బొమ్మలు రెండూ ఉంటాయి. అయితే మ్యాటర్మధ్యలో బొమ్మని ఉంచేటపుడు ఈబొమ్మని పేజీ మధ్యలో ఏ పొజిషన్ లో (మధ్యనలేదా చివరనా) అన్న సందేహం వస్తుంది. ఆ బొమ్మ చుట్టూ ఎంతరూరంలో మ్యాటర్ఉండాలన్న సందేహం రావచ్చు. ఈ సమస్యం పరిష్కారానికే వెలువడిన ఆప్షనే Text Wrap. టెక్స్ట్, బొమ్మలు ఒకదానికి ఒకటి సంఘర్షణకి గురికాకుండా కాపాడేదే Text Wrap. 
ఉదహరణకు క్రింది బోమ్మను గమనించండి 


ఇక్కడ ఒక కథకు సంబంధించిన మేటర్ ప్రక్కనే దానికే చెందిన ఇలస్ర్టేషన్ ఉన్నాయి.
>Layout>Coloumn Guides వెళ్ళి పేజీకి 2 Columns ఇవ్వండి.
ఇలస్ర్టేషన్కు రెండు కాలమ్స్ మధ్యకు తీసుకువచ్చి ఇలస్ర్టేషన్ అవుట్లైన్ చుట్టూ మేటర్ అమర్చాలంటే Text Wrap కమాండ్ ఉపయోగించాలి. పేజిమేకర్లోని ముఖ్యమైన వాటిలో ఇది ఒకటి.
తరువాత Text Wrap కమాండ్ ఇవ్వడానికి ముందు Text మొత్తాన్ని Ctrl+A ద్వారా సెలెక్టు చేసుకుని (Text కర్సర్ మేటర్ పై ఉండాలి) Type మెనూలోకి వెళ్లి >Alignment>Justify (Shift+Ctrl+J) కమాండ్ ఇవ్వండి.
ఇలస్ర్టేషన్ను కాలమ్స్ మధ్యకు తీసుకురావాలి. ఇలస్టేషన్ సెలెక్ట్ చేయబడి ఉండగానే Element మెనూకు వెళ్లి Text Wrap క్లిక్ చేస్తే క్రింది విధంగా బాక్స్ వస్తుంది.


పేన వరుసలో మూడు ఆప్షన్లు ఉంటాయి.
వాటిలో మీకు కావాల్సిన దానిని క్లిక్ చేస్తే టెక్ట్స్ ఆ బొమ్మ ప్రక్కలకు పోతూ ఉంటుంది.
క్రింది వరుసలో వున్న మూడు ఆప్షన్లలో కూడా కావాల్సిన దానిని క్లిక్ చేయాలి.

Text Wrap సెట్టింగ్ పేజిలో Wrap Option వద్ద భాగంలో మధ్యనున్న ఐకాన్పై క్లిక్ చేసి ఒక ఆప్షన్ను ఎన్నకుందాం. Stand off in MM వద్ద Tab కీ అన్నివైపులా ఇవ్వండి. డిఫాల్ట్గా ఉన్న వాల్యూ బదులుగా ఇవ్వాలి. Tab కీ ఉపయోగిస్తూ ఒక దాని నుండి మరొకదానికి సెలెక్టు చేసుకుంటూ వెళ్లవచ్చు. ఇప్పుడు Ok చేయండి.
ఇమేజ్పై పై కమాండ్ అప్లయి చేయబడి కనబడుతుంది.
బొమ్మ చుట్టూ చుక్కలతో ఒక రెక్టాంగిల్ సెకెక్షన్ కనపబడుతుంది. దీనికి నాలుగు మూలలా 4 నోడస్ ఉంటాయి. పాయింటర్ను ఎడమవైపు పై భాగంలో ఉన్న నోడ్ వద్దకు తీసుకువెళ్ళి మౌస్ లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి లోపలివైపు డ్రాగ్ చేయండి.
ఇప్పుడు చుక్కలతో కనపడుతున్న సెలెక్షన్ ఎక్కడైనా మౌస్తో క్లిక్ చేసి నోట్స్ క్రియేట్ చేయవచ్చు. అలా క్రియేట్ చేసిన నోడ్స్ను మౌస్ పాయింటర్తో ఏ దిశలోనైనా డ్రాగ్ చేయవచ్చు. బొమ్మ అవుట్ లైను వంపు తిరిగిన ప్రతిచోట నోట్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇలస్ర్టేషన్ అవుట్ లైను చుట్టూ అవసరమైన చోటల్లా నోడ్స్ క్రియేట్ చేస్తూ టెక్ట్సును బొమ్మ చుట్టూ అమర్చాలి. Text Wrap కమాండ్ ఇచ్చిన తరువాత కూడా బొమ్మను సెలక్టు చేసుకుని పైకి లేదా ప్రక్కలకు జరుపుకునే వీలుంది.
బొమ్మ 2 లో చూపించిన విధంగా వోవెల్ చుట్టూ Text Wrap కమాండ్ ఇవ్వవలసి వచ్చినపుడు మధ్య భాగంలో ఉన్న హెడ్డింగ్ స్ర్ఫింగ్ వోవెల్ స్ర్పింగ్ బయటికి మించి ఉండరాదు.

Text Wrap గురించి మరింత సమాచారం కోసం  లో దీనికి సంబంధించిన ఒక ట్యుటోరియల్నుఇక్కడ క్లిక్ చేసి చూడండి
ఈ ఫోరమ్ లో చూడాలంటే రిజిస్ర్టేషన్ తప్పనిసరి. 

పేజిమేకర్లో ఎలిమెంట్స్ మెనూ గురించి తెలుసుకుందాం (Elements Menu)

మనం డ్రా చేసిన లైన్స్ కు, బాక్స్ లకు కలర్ అప్లై చేయాలన్నా, లైన్ల మందంపెంచాలన్నా మనకు ఈ ఎలిమెంట్స్మెనూలోని ఆప్షన్లు ఉపయోగపడతాయి. మరీ ఈమెనులో వాటి గురించి తెలుసుకుందాం.
Fill కమాండ్

ఒక బాక్స్ షేప్ గీసి దాన్ని సెలక్ట్ చేసి Fill కమాండ్లోకి వెళ్ళి అందులో ఉన్న ఆప్షన్లను క్లిక్ చేస్తే బాక్స్ లోపలి భాగంలో డిజైన్స్ అప్లయి అవుతాయి. వాటిని క్రింద గమనించండి.


లైన్ లేదా స్ర్టోక్ (Stroke)
మనం తీసుకున్న బొమ్మలు, బాక్స్లు చుట్టూ బోర్డర్ లాగా లైన్ గీస్తాం. ఆ లైన్ యొక్క మందం ఈ మెనూ ద్వారా పెంచుకోవచ్చు, తగ్గిచ్చుకోవచ్చు. Element>Stroke మీద క్లిక్ చేస్తే క్రింది విధంగా కనిపిస్తుంది.

వాటిలో మీకు ఎంత మందం కావాలో సెలక్టు చేసుకోవచ్చు. అంతే కాకుండా Custom ఆప్షన్ ద్వారా మీకు కావలసినంత మందంను కూడా సెట్ చేసుకోవచ్చు.
ఉదా: 3 లైన్ల మ్యాటర్ టైప్ చేసి, ఒక బాక్స్ గీసి దానికి 2pt. మందం అప్లయి చేయండి. టైప్ చేసిన మ్యాటర్ లేయర్ను ఆ బాక్స్లోకి తీసుకురండి. అప్పుడు క్రింది విధంగా ఉంటుంది.


Fill and Stroke
Element>Fille and Stroke క్లిక్ చేయడం ద్వారా ఈ క్రింది ఆప్షన్ను పొందవచ్చు.
Shortcut : Ctrl+U


Arrange
ఈ కమాండ్ ద్వారా మనం రెండు లేదా అంత కంటే ఎక్కువ లేయర్లను తీసుకున్నపుడు వాటిని క్రిందికి, పైకి మార్చుకోవడానికి ఈ కమాండ్ ఉపయోగపడుతుంది. వీటిలో ఉపయోగపడే ఆప్షన్లు గురించి తెలుసుకుందాం.

Bring to Front ( Shift+Ctrl+] )
ఒక లేయర్ని(టెక్ట్స్, ఇమేజ్, బాక్స్ ఏదైనా సరే) సెలక్ట్ చేసుకుని Bring to Front క్లిక్ చేయడం వల్ల అన్ని లేయర్ల కంటే ముందు ఉంటుంది.


Send to Back (Shift+Ctrl+[ )
ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే అన్ని లేయర్ల కంటే వెనక్కి వెళుతుంది.


Align Objects (Shift+Ctrl+E)
రెండు Objects ను తీసుకుని సెలక్ట్ చేసి Align Objects ఆప్షన్ క్లిక్ చేస్తే తదనుగుణంగా క్రింది విధంగా విండో ఓపెన్ అవుతుంది. దానిలో కుడి ప్రక్క, ఎడమ ప్రక్క మీకు నచ్చిన ఆప్షన్స్ సెట్ చేసి Ok చేయండి. మీరు తీసుకున్న Objectsని గమనించండి.


గ్రూప్ చేయడం (Ctlr+G)
మనం డాక్యుమెంట్లో ఉపయోగించిన లేయర్లను అన్నింటిని లేదా మనకు కావలసిన వాటిని సెలక్టు చేసుకుని Group క్లిక్ చేస్తే అన్ని ఒక లేయర్ క్రింద మారిపోతుంది.

Ungroup (Shift+Ctlr+G)
గ్రూప్ చేసిన దానిని క్లిక్ చేసి Ungroup ఆప్షన్ క్లిక్ చేస్తే మరళ తిరిగి విడి విడి లేయర్లగా మారిపోతుంది.

Mask (Ctlr+6)
ఒక బాక్స్, ఒక ఇమేజ్ తీసుకోండి. బాక్స్ పై ఇమేజ్ను ఉంచండి.
రెండిటిని సెలక్ట్ చేసి Mask అప్లై చేయండి అపుడు ఎంత పెద్ద ఇమేజ్ అయినా మీరు తీసుకున్న బాక్స్ షేప్లో మాత్రమే కనబడుతుంది. తరువాత ఇమేజ్ ఏ భాగం కనబడాలో జరుపుకుంటే సరిపోతుంది. అలాగే చిన్నగా కనబడాలంటే సైజు తగ్గించుకుంటే సరిపోతుంది.


Unmask (Shift+Ctlr+6)
మాస్క్ చేసిన వాటికి మాస్క్ ను తొలగించడానికి ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది.

Rounded Corners
ఒకోసారి మనకు బాక్స్ చివరల గుండ్రంగా కావాల్సి ఉంటుంది. ఉదాహరణకు క్రింది బాక్స్ని చూడండి.


ఇలా రావడం కోసం ఒక బాక్స్ డ్రా చేసి Elecments>Round Corners క్లిక్ చేస్తే వచ్చే మెనూలో ఒకదాన్ని సెలక్ట్ చేసుకోని Ok చేయండి.

Blog Archive

Followers

Powered By Blogger