Wednesday 22 February 2012

 Split Archives - Installation Issues - Tutorial
గమనిక: ఈ పోస్ట్ లో వాడిన సాఫ్ట్ వేర్, కీజెన్, ఉపయోగించిన తెరపట్టులు కేవలం టెస్టింగ్ మరియు ట్యుటోరియల్ కొరకు మాత్రమే. మీకు ఈ సాఫ్ట్ వేర్ నచ్చినట్లైతే దానిని కొనుక్కుని వినియోగించగలరు.

అనేకానేక సాఫ్ట్ వేర్ లు, మూవీలు, మూవీ క్లిప్స్ యొక్క ఫైల్ సైజ్ లు ఎక్కువ పరిమాణంలో ఉన్నపుడు వాటిని నెట్ ద్వారా ఇతరులకు అందించడానికి ఔత్సాహికులు చాలా ఇబ్బందులు పడాలి. ముఖ్యంగా టోరెంట్ విధానం లో అలా చేయని వారు తప్పని సరిగా వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనికి కారణం అనేక అప్ లోడ్ సైట్ ల లో ఉండే ఒక్కొక్క ఫైల్ కు ఇచ్చే పరిమిత సైజ్, పరిమితమైన ఇంటర్నెట్ అప్ లోడింగ్ వేగం, అప్ లోడింగ్ కు అందుబాటులొ ఉండే సమయం మొదలైనవి.
ఒక పెద్ద ఫైల్ ను చిన్న చిన్న ముక్కలుగా చేయటం అనేది టోరెంట్ విధానంలో ఆటోమాటిక్ గా జరిగిపోతుంది. దానిని మనం క్రింది తెరపట్టులో చూడవచ్చు. 
Image has been scaled down 32% . Click this bar to view full image (882x536).
[Image: c5b7cde7.jpg]

కాని మిగతా సాధారణ విధానాల లొ(అంటే http మార్గంలో) మనం దానిని ముక్కలు చేయవలసిందే. ఈ విధానానికి చాలా మంది WinRar ను ఉపయోగించి ముందుగా Archive ఎంచుకుని పెద్ద ఫైల్ ను చిన్న చిన్న ముక్కలుగా Split చేస్తారు. అపుడు ఆ ఫైల్ ను Split Archived ఫైల్ అంటాము. ఆ విధంగా Split చేయాలంటే ఈ ట్యుటోరియల్ ను చూడండి. కొన్ని కొన్ని సార్లు ఆ Split Archive ని డౌన్ లోడ్ చేసుకుంటారు కాని ఈ విధానం పై అవగాహన లేక ఆ సాఫ్ట్వేర్ ను ఎలా ఇనస్టాల్ చేసుకోవాలో తెలియదు. 

అలాంటి ఉదాహరణకు మన ఫోరంలోని పోస్ట్ లనే ప్రాతి పదిక గా తీసుకోవటం జరిగింది. ముందుగా క్రింది లింక్ లొ DRK Reddy అనే గౌరవ సభ్యులు Aurora 3D Animation Maker v12.02.08 పై ఒక పోస్ట్వేసి ఆ సాఫ్ట్ వేర్ డౌన్ లొడ్ కు లింక్ లు ఇచ్చారు. ఆ లింక్ ల లో ఉన్న సాఫ్ట్ వేర్ 35.7MB సైజ్ ఉంది. ఆ పోస్ట్రర్ దానిని 8 ముక్కలు గా Split చేసి అప్ లోడ్ చేశారు. దానిని మన ఫోరం లోని మరో గౌరవ సభ్యులు asheervadham డౌన్ లొడ్ చేసుకుని దానిని ఎలా ఇనస్టాల్ చేయాలో తెలియక ఇబ్బంది పడుతూ మరో పోస్ట్ వేశారు. DRK Reddy గారి పోస్ట్ లోనే రిప్లై లొ అడిగి ఉంటే బాగుండేది కాని కొత్త పోస్ట్ క్రియేట్ చేశారు. ఏదైనప్పటికీ ఇది జనరల్ గా అందరికి ఉండే సమస్య కాబట్టి వేరే పోస్ట్ లో వివరణ తో కూడిన ట్యుటోరియల్ ఇవ్వటం జరుగుతుంది. క్రింది ఇమేజ్ లను వరుసగా తిలకించి వాటిలోని వివరణ ను సమగ్రంగా గ్రహించండి.

Aurora-1
Image has been scaled down 10% . Click this bar to view full image (663x704).
[Image: 0e62d9ce.jpg]

Aurora-2
Image has been scaled down 10% . Click this bar to view full image (665x632).
[Image: 981b8f4f.jpg]
Aurora-3
Image has been scaled down 10% . Click this bar to view full image (663x708).
[Image: 89acee1c.jpg]
Aurora-4
Image has been scaled down 24% . Click this bar to view full image (784x714).
[Image: 401904c7.jpg]
Aurora-5
Image has been scaled down 10% . Click this bar to view full image (664x417).
[Image: f847c2bc.jpg]

Aurora-6
[Image: 7dde8f35.jpg]
Aurora-7
Image has been scaled down 10% . Click this bar to view full image (663x769).
[Image: f6ecb1ca.jpg]
Aurora-8 gif
[Image: 8534bd1c.gif]
Aurora-9
Image has been scaled down 6% . Click this bar to view full image (632x401).
[Image: 1f329697.jpg]
Aurora-10
Image has been scaled down 5% . Click this bar to view full image (631x433).
[Image: 3a52d1cf.jpg]
Aurora-11
[Image: e97c1e7e.jpg]
Aurora-12
[Image: 8eca9455.jpg]
Aurora-13
[Image: 2e0c87aa.jpg] 

No comments:

Post a Comment

Blog Archive

Followers

Powered By Blogger