పేజిమేకరులో డాక్యుమెంట్ ని సృష్టించడం (File Menu)
1. Pagemaker ఓపెన్ చేయగానే వచ్చే తెరలో File మీద క్లిక్ చేస్తే వచ్చే మరోమెనూలో New మీద క్లిక్ చేయండి.
2. అపుడు Document Setup కనబడుతుంది. దానిలో ok మీద క్లిక్ చేయండి.మీ ముందు తెల్లని తెర వలెప్రత్యక్షమవుతుంది. మనం అందులోనే డాక్యుమెంట్నిఅక్కడే తయారు చేసుకోవాలి.
3. ఇప్పుడు మీరు తెర ప్రక్కనే వున్న టూల్ బాక్స్లో కనిపించే వాటిలో T (Text కోసం) మీద క్లిక్ చేయండి.
అప్పుడు కర్సర్ నిలువుగా మారుతుంది. దానిని మీకు కన్పించే తెర మీద మొదట్లో క్లిక్ చేస్తే నల్లటి గీత ఏర్పడుతుంది.
4. ఇప్పుడు మీరు ఉదాహరణగా ఏదైనా మీ బయోడెటాను మరెదైనా మ్యాటర్ ను టైప్ చేయండి. ఒక పేజికి చివరికి లైను రాగానే కంప్యూటరు తనంతట తానే తరువాతి లైన్కి కర్సర్ని మళ్ళిస్తుంది. అయితే ఒక పేరా సగం లైన్ లో ముగించి తదుపరి పేరా మీరు టైప్ చేయ్యాలంటే మటుకు ఎంటర్ మీద క్లిక్ చేయ్యాలి.
5. మీరు టైప్ చేసిన డాక్యుమెంట్ బాగా కన్పించడానికి మీరు తెరపై కన్పించే మెనూలోని View మీద క్లిక్ చేయండి., తద్వరా వచ్చే ఉపమెనూలో Actual Size (Ctrl+1) మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీ డాక్యుమెంట్ ఒక ప్రక్కకి ఒరిగిపోతే మీరు టూల్ బాక్స్లో చేతి గర్తు (Alt) మీద క్లిక్ చేసి, డాక్యుమెంట్ని విండో మధ్యకి జరపుకోవచ్చు.
6. మ్యాటర్ ని టైప్ చేసేసారు కదా. అంతే డాక్యుమెంట్ తయారు అయినట్లే. మరి ఈ డాక్యుమెంట్ని మళ్లి మరెప్పుడైనా కావాలంటే ఎలా. అందుకోసం డాక్యుమెంట్ని Save చేసుకోవాలి. Save చేసుకోవడానికి దానికొక పేరు ఇవ్వాలి. ఉదహరణకు చేసిన డాక్యుమెంట్కి DTP అని పేరు ఇద్దాం. ఫైల్ ని కంప్యూటర్ లో భద్రపరడాన్నే కంప్యూటర్ భాషలో Save అంటారు. అదెలా చేయాలో తెలుసుకుందాం.
తెరమీద కన్పించే File మీద క్లిక్ చేస్తే వచ్చే ఉపమోనూలో Save మీద క్లిక్ చేయండి.
ఫలితంగా మీ ముందు ఈ క్రింది విధంగా ఒక తెర ప్రత్యక్షమవుతుంది. తెరలో File Name అన్న ప్రక్ననే కర్సర్ని ఉంచి DTP అని టైప్ చేయాలి. తరువాత ఆ ప్రక్కనే ఉన్న Save మీద క్లిక్ చేయండి.
అంతే! ఇప్పుడు మీరు సృష్టించిన డాక్యుమెంట్ మీ కంప్యూటర్లో DTP పేరు మీద భద్రంగా ఉండిపోతుంది.
ఆ తర్వాత తెరలోని File మీద క్లిక్ చేసి తదనుగుణంగా వచ్చే Close మీద క్లిక్ చేయండి. మీరు ఆ ఫైలు నుండి బయటకి వచ్చేస్తారు.
తిరిగి ఫైల్ని చూడటం
కొన్ని రోజుల తర్వాత మీరు అంతకు ముందు సృష్టించిన DTP ఫైలుని చూడాలనుకోండి. అప్పుడు తిరిగి Pagemaker లోకి వెళ్ళి File మెనుమీద క్లిక్ చేసి అందులో Open అనే సబ్మెను మీద క్లిక్ చేస్తే ఫలితంగా మీ ముందు ఈ క్రింది తెర కన్పిస్తుంది.
ఫై తెరలో మీరు DTP ఫైలుని ఎక్కడ సేవ్ చేశారో అక్కడికి వెళ్ళి DTP ఫైల్ మీద కర్సర్ని ఉంచి డబుల్ క్లిక్(రెండుసార్లు క్లిక్) చేయండి. వెంటనే ఈ ఫైలు మీముందు ప్రత్యక్షమవుతుంది.
Recent Publications
ఇటీవలనే సృష్టించిన లేదా పనిచేసిన ఫైళ్ళని చూడటానికి లేదా ఓపెన్ చేయడానికి దీనిని ఉపయోగిస్తారు. మీరు మీ కంప్యూటర్లో File>Recent Publications మీద క్లిక్ చేసి చూడండి.
Document Setup
టెక్ట్స్ ని తీసుకోవడానికి మనం ఎన్ని పేజీలు కావాలో, ఎంత సైజు కావాలో లాంటి వాటిని నిర్దేశించేదే ఈ Document Setup మనం వర్క్ చేసే ముందు దీనిమీద క్లిక్ చేయాలి.
సాధారణంగా మనం బుక్వర్క్ చేస్తున్నప్పుడు సుమారుగా ఇన్ని పేజీలు కావాలని పేర్కొనాల్సి వస్తుంది. అదే గ్రీటింగ్ కార్డులు, విజిటింగ్ కార్డుల వంటి వాటిని సైజులు CM లలో సృష్టంగా పేర్కొనాలి. అలా టైప్ చేయబోయే పేజీ పరిమాణం, కుడి ఎడమల గ్యాప్ లు సర్దుబాటు చేయడానికి ఈ Document Setup ఉపయోగపడుతుంది.
Place Command
మన కంప్యూటర్ లో కేవలం పేజిమేకర్ లోనే పని చెయ్యం. ఇతర ప్యాకేజీల్లోనూ పని చేస్తాం. అందులో సృష్టంచిన ఫైళ్ళు ఒక్కొసారి మనకు పేజిమేకర్ లో వాడుకోవడానికి అవసరం కావచ్చు. ఈ నేపధ్యంలో అలా వాడుకోవడానికి మనకు లభ్యమయ్యే అవకాశమే ఈ Place కమాండ్. ఈ కమాండ్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ క్రింది విధంగా వచ్చే బాక్స్లో అన్ని ప్యాకేజిలలో ఉండే ఫైల్సు కనిపిస్తాయి.
మీకు కావల్సిన ఫైలుని ఎన్నుకొని Open క్లిక్ చేస్తే ఈ ఫైల్ను పేజిమేకర్ లోకి దిగుమతి చేసుకోవచ్చు.
Links Command
ఇతర ప్యాకేజీల్లోని లింక్ చేయబడ్డ ఈ కమాండ్ గురించి ఎక్కవ వివరణ అవసరం లేదు. ఈ Links కమాండ్ని ఉపయోగించాలంటే పేజిమేకర్ లో మనం చాలా హెచ్చుస్థాయి పరిగ్జ్నానం ఉండాలి.
Preferences Command
ఇది మనకు పేజిమేకర్ లో అంతగా అవసరం లేదు.
మనం చేసిన డాక్యుమెంట్ ని ప్రింట్ రూపంలో చూసుకోవడానికి ఈ Print కమాండ్ ఉపయోగపడుతుంది. దీని కోసం “పేజీలను ప్రింట్ చేయడం” అనే ట్యూటోరియల్ ను చూడండి.
Exit (Ctrl+q)
పేజిమేకర్ లో నుండి మనం బయటకు రావడానికి ఈ కమాండ్ని ఉపయోగిస్తాం. ఇక్కడ Close(Ctrl+W) కమాండ్కి, Exit కమాండ్కి తేడాని గమనించాలి. Close కమాండ్ కేవలం పేజిమేకర్ డాక్యుమెంట్ (ఫైల్) మాత్రమే క్లోజ్ అవుతుంది. Exit కమాండ్ని ఉపయోగించడం వల్ల మొత్తం పేజిమేకర్ నుండి బయటకు వస్తాం.
No comments:
Post a Comment