మొదట BIOS లో first boot device ని cdrom/rw(or DVD) కి సెట్ చెయ్యండి. (లేక పొతే సిస్టం స్టార్ట్ చేసి కూడా boot device ఎంచుకోవచ్చు. కానీ ఒక్కో సిస్టం కి ఒక్కో కీ ఉంటుంది, మోడల్ ని బట్టి)ఇప్పుడు విండోస్ సీడి cd/dvd డ్రైవ్ లో ఉంచి సిస్టం రీస్టార్ట్ చెయ్యండి.ఇప్పుడు సిస్టం press a key to boot from cd/dvd అని చూపుతుంది. అలా చూపగానే ఒక కీ నొక్కండి.ఇప్పుడు సీడి కొన్ని ఫైల్స్ ని లోడ్ చేసి ఒక blue screen చూపుతుంది. ఇప్పుడు అసలు ఇన్స్టాల్ ప్రాసెస్ మొదలవుతుంది.ఇప్పుడు install xp, repair xp అని రెండు ఆప్షన్స్ చూపుతుంది.ఇప్పుడు license agreement page చూపుతుంది. F8 బటన్ నొక్కండి.ఇప్పుడు హార్డ్ డ్రైవ్ చెక్ చేసి, ఉన్న పార్టిషన్స్ చూపుతుంది.(కొత్తగా ఇన్స్టాల్ చేస్తుంటే పార్టిషన్స్ ఉండవు. మనమే చేసుకోవాలి.)ఒకవేళ ఉన్న పార్టిషన్ ని తీసేసి కొత్తగా సృష్టించుకోవాలంటే, ఏదైతే తీసేయ్యాలనుకుంటున్నారో దాన్ని ఎంచుకుని, D నొక్కండి. అది, ఖచ్చితంగా తీసేయోచ్చా అని అడుగుతుంది. తీసెయ్యాలి అనుకుంటే L కొట్టండి. లేకపొతే ఎస్కేప్ కొట్టి వెనక్కువెళ్ళండి.కొత్తగా పార్టిషన్స్ చెయ్యడానికి, Unpartitioned Space మీదకి వచ్చి, c నొక్కండి.ఇప్పుడు మొత్తం స్పేస్ లో ఎన్ని పార్ట్టిషన్స్ చెయ్యాలో అంచనా వేసి, ఈ పార్టిషన్ కి ఎంత స్పేస్ ఇవ్వాలో నిర్ణయించుకుని, ఆ నెంబర్ ఇవ్వండి. (స్పేస్ మెగాబైట్లు గా చూపుతుంది. ఉదాహరణకి, మీరు 15000 అని ఇస్తే ఆ డ్రైవ్ 15GB ఉంటుంది)తర్వాత os ఇన్స్టాల్ చేయడానికి డ్రైవ్ ఎంచుకోండి.(సాధారణంగా మొదటి డ్రైవ్ ఎంచుకుంటారు.)ఇప్పుడు డ్రైవ్ ఫార్మటు చూపుతుంది. ఇక్కడntfs(quick format) ఎంచుకోండి.ఇప్పుడు డ్రైవ్ ఫార్మాట్ అయ్యి ఫైల్ సిస్టం లోడ్ అవుతుంది.తర్వాత OS ఫైల్స్ డ్రైవ్ లోనికి కాపీ అవుతాయి. మొత్తం ప్రాసెస్ పూర్తైన తర్వాత సిస్టం రీస్టార్ట్ అవుతుంది.ఇప్పుడు డ్రైవ్ లో లోడ్ ఐన ఫైల్స్ నుండి ఇన్స్టలేషన్ కొనసాగుతుంది. (స్క్రీన్ GUI గా మారుతుంది.)ఇక్కడ సిస్టంlanguage selection, keyboard layout selection అడుగుతుంది.english(US)ఎంచుకోండి. default గా అదే ఉండి ఉంటుంది చూడండి . next నొక్కితే పేరు, ఆర్గనైజేషన్ వివరాలు అడుగుతుంది, ఇంట్లో పీసీ ఐతే ఆర్గనైజేషన్ ఏదోటి ఇచ్చేయ్యండి.తర్వాత product key అడుగుతుంది. సీడి పైన ఉన్న 25 digit key ని ఎంటర్ చెయ్యండి.ఇప్పుడు System Name, Administrator Password అడుగుతుంది. ఆ రెండు ఎంటర్ చెయ్యండి.(AdministratorPassword ఇవ్వక పోయిన పర్వాలేదు.ఇప్పుడు date, time, time zoneవివరాలు అడుగుతుంది. time zone ని new delhi, kolkata, mumbai, chennai(GMT+5:30)గా ఎంచుకోండి.ఇప్పుడు network setup చూపుతుంది. ఇక్కడ domain default settings గా ఎంచుకోండి. Next నొక్కితే మీ workgroup ఏంటో అడుగుతుంది, తెలిస్తే మీకు కావాల్సిన గ్రూపు పేరే ఇవ్వండి, లేకుంటే WORKGROUP అని ఉంచేయ్యండి.ఇప్పుడు next నొక్కగానే మొత్తం ఇన్స్టలేషన్ పూర్తవుతుంది.తర్వాత సిస్టం రీస్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అన్నిటికి Ok/Next కొట్టుకుంటూ వచ్చేయ్యండి (క్రిందున్న తెరపట్టులు చూడండి). చివరి స్టెప్పులో username ఎంటర్ చేయండి. తర్వాత వచ్చే network check niskipచెయ్యండి.ఇక్కడ నెట్వర్క్ చెక్ వస్తుంది, దాన్ని దాటవేసేయ్యండి(skip).ఇప్పుడు మీ login screen , desktop కాన్ఫిగర్ అవుతాయి. తర్వాత మీ ఎకౌంటు లోనికిloginఅవుతుంది.దీనితో ఇన్స్టలేషన్ పూర్తి అవుతుంది.సిస్టం పూర్తిగా పని చేయడానికి మీకు సిస్టం తో పాటు ఇచ్చిన system driver cd నుంచి డ్రైవర్ సాఫ్ట్వేర్లను ఇన్స్టాల్ చేయండి.
Subscribe to:
Post Comments (Atom)
Blog Archive
-
▼
2012
(280)
-
▼
February
(46)
- ఫాంట్లు అన్నింటిని ఒకేసారి చూపించే సాఫ్ట్వేర్సహజం...
- ఫైల్ to Save ఫోల్డర్ ఎలాగో చుద్దామా?మనం పేజ్ మేకర...
- పేజిమేకరులో డాక్యుమెంట్ ని సృష్టించడం (File Menu)...
- ఫేజిమేకర్ తెరలోని వివిధ పరికరాలు – వాటి వివరణఇంతక...
- డాక్యుమెంట్లో మార్పులు, చేర్పులు చేయ్యడం (Edit Me...
- పేజిమేకర్ అక్షరాలను ఆకర్షణాయంగా తీర్చిదిద్దడం (Ty...
- పేజిమేకర్లో మ్యాటర్‌ను పేజీలలో సెట్ చేయడం ఎలాగో తె...
- పేజిమేకర్లో Text వ్రాప్ గురించి తెలుసుకుందాంమనం త...
- పేజిమేకర్లో ఎలిమెంట్స్ మెనూ గురించి తెలుసుకుందాం ...
- లేఅవుట్ మెనూ (Layout Menu)
- వ్యూ మెనూ (View Menu)
- పేజిమేకర్ ప్రాథమిక పరిగ్జ్నానం (Introduction)
- Essential Softwares
- Virtual Box
- Telugu typing without using 'AnuScript'- solution...
- Split Archives - Installation Issues - Tutorial గ...
- game is superbb.Try it
- Unigraphics-NX6 telugu tutorial-18 ఈ ట్యుటోరియల...
- USB drive లలో స్పేస్ full Data nill అని చూపిస్తుందా?
- MY Computer fast గా open చేయటానికి
- విండోస్ Xp Intalling & Formating
- Strangers తో Video Chatting కోసం Top 5 Websites
- మీరు ఇంకా సులభంగా Browsing చేసుకోడానికి ఉపయోగపడే S...
- అన్ని ఫైల్స్ కి ఓకేసారి Rename చేయాలా?
- Start Button లో మీ పేరు కావాలా?
- Youtube లో ads ని skip చేయ్యటానికి
- Gallary
- Web Design
- mayaaaaaaaaaaaaaaaaaa
- ivi choodu maya nerchukooooo
- దేవాలయాలు
- softwaresssssssssssssssssssssssssssssssss
- ఆన్ లైన్ సమాచారం
- Microsoft Office Language Interface Pack 2007 - Te...
- Windows భాషా ఇంటర్ఫేస్ ప్యాక్ (LIP)
- Revert Back to Internet Explorer 8 from Internet E...
- లేఖిని గురించి
- కంప్యూటర్ లో అవసరం లేని Files డిలిట్ చేయుట ?
- Wood Caluculator
- Hello 3D World
- *50gb free Online Storage ని అందించే వెబ్‌సైట్స్
- *e Shopping Sites
- *తెలుగు లో లభించే కొన్ని కంప్యూటర్ పుస్తకాలు
- వ్యక్తిగత ఫైల్స్ కి భద్రత కల్పించే మంచి సాఫ్ట్వేర్లు.
- the easiest way-to-download-music-from-youtube-on-...
- 3d lo naku thelsina konni
-
▼
February
(46)
No comments:
Post a Comment