డాక్యుమెంట్లో మార్పులు, చేర్పులు చేయ్యడం (Edit Menu)
మీరు ఓ లెటర్ / డాక్యుమెంట్ ని సృష్టించారు. దానిలో ఒక చోట Spellingమర్చాలన్నా లేదా అనవసరం అనిపించినలైన్స్ తీసేయాలన్నా, మరోచోట మ్యాటర్ నికలపాలన్నా, మొత్తం డాక్యుమెంట్లో ఉన్న మిస్టేక్ లను సరిదిద్దాలన్నా ఈఎడిట్ మెనూఉపయోగపడుతుంది.
టెక్స్ట్ ని ఎలా సెలక్ట్ చేయాలంటే
టెక్స్ట్ ని ఎలా సెలక్ట్ చేయాలంటే
- టెక్స్ట్ మీద క్లిక్ చేసి, మౌస్తో డ్రాగ్ చేయడం.
- టెక్స్ట్ మొదట కర్సర్తో క్లిక్ చేసి, కర్సర్ ద్వారా వెలువడే I-బీమ్ మార్క్ను టెక్స్ట్ముగిసే చోట ఉంచి Shift నినొక్కడం ఒక పదం మీద కర్సర్ యొక్క I-బీమ్ను ఉంచి, ఆ పదాన్ని డబుల్ క్లిక్ (రెండు సార్లు) చేయడం
- ఒక పేరా మీద కర్సర్ యొక్క I-బీమ్ను ఉంచి మూడుసార్లు క్లిక్ చేయడం.
టెక్స్ ని కలపడం (Adding Text)
డాక్యుమెంట్ లో కొంత సమాచారాన్ని అదనంగా కలపాలనుకోండి. అప్పుడు కర్సర్ ని ఎక్కడ సమాచారం కావాలో అక్కడ ఉంచి టైప్ చేయడం ప్రారంభించాలి. ఉదాహరణకు ఏదైనా చేసిన ఫైల్ ని ఓపెన్ చేయండి. అందులో పేరా తరువాత ఉదాహరణకు Edit Menu Tutorial ను కలపాలనుకోండి. అప్పడు మొదటి పేరా ఆఖరి వాక్యం తర్వాత కర్సర్ ను ఉంచి పై వాక్యాన్ని టైప్ చెయ్యాలి. టైప్ చెయ్యడం మొదలు పెట్టగానే కంప్యూటర్లో ఆటోమాటిక్గా క్రింది పేరాలు తమ స్థానాన్ని తదనుగుణంగా మార్చుకుంటాయి.
అయితే మీరు టైప్ చేసేముందు Tool Box లోని టెక్స్ట్ టూల్ మీద క్లిక్ చేసి ఆ తర్వాత టైప్ చేయడం ప్రారంభించాలి.
టెక్స్ట్ ని తొలగించడం (Delete)
వాక్యంలో ఒక పదాన్ని గాని పదాలను గాని తొలగించాలనుకుంటే మనకు రెండు అవకాశాలు ఉన్నాయి. అందులో
1. ఏ పదాన్నయితే తొలగించాలనుకున్నారో ఆ పదం ముందు కర్సర్ను ఉంచి Delete Keyని క్లిక్ చేస్తూ పోతే కర్సర్ ప్రక్క ఉన్న అక్షరాలు, Back Space Key క్లిక్ చేస్తే కర్సర్ ముందు ఉన్న అక్షరాలు డిలీట్ అవుతూ ఉంటాయి.
2. కర్సర్ ను మ్యాటర్ లో మనకు ఎక్కడనుంచి అక్కర్లేదో అక్కడ టెక్స్ట్ టూల్తో క్లిక్ చేసి తరువాత ఎక్కడ వరకు అక్కర్లేదో అక్కడ Shift పట్టుకుని టెక్స్ట్ టూల్తో క్లిక్ చేసి Delete క్లిక్ చేస్తే సెలక్స్ అయిన మాటర్ మొత్తం డిలీట్ అయిపోతుంది.
Undo
ఫైలు మెనూలోని Edit మీద క్లిక్ చేస్తే వచ్చే ఉపమెనూలో ఈ Undo ఉంటుంది. పొరబాటున మనం ఒక వాక్యం లేదా పేరాని తొలగిస్తే తిరిగి పొందడానికి ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. అయితే పొరబాటు చేసిన వెంటన్ ఈ Undo బటన్ క్లిక్ చేయాలి. అంతేకాని చాలా పనులు, ఆప్షన్లు క్లిక్ చేశాక ఈ Undo ఆప్షను వాడితే పని చేయదు.
Cut
ఒకోసారి మనం కొంత సమాచారాన్ని ఒక డాక్యుమెంట్ని నుంచి మరో డాక్యుమెంట్లోకి తీసుకెళ్ళాల్సి ఉంటుంది. మ్యాటర్ ని సెలక్స్ చేసి ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే, ఆ మ్యాటర్ అసలు డాక్యుమెంట్లో నుండి తొలగింపబడుతుంది. ఇలా ఒక మ్యాటర్ ని అక్కడ తొలగించి వేరు డాక్యుమెంట్ కోసం తీసుకెళ్ళాల్సి వచ్చినపుడు ఈ ఆప్షన్ నొక్కితే చాలు.
Paste
ఇంతకు ముందు మీరు పాత డాక్యుమెంట్లోని కొద్ది సమాచారాన్ని కట్ చేశారు కదా! ఇప్పుడు దానిని వేరు డాక్యుమెంట్లోకి అతికించాల్సి వచ్చినపుడు కర్సర్ ను మీరు కట్ చేసిన మ్యాటర్ ఎక్కడ కావాలో ఉంచి Edit మెనూలోని Paste మీద క్లిక్ చేయడం ద్వారా చేయవచ్చు.
Select all
ఒక వేళ మొత్తం టెక్స్ట్ ని సెలక్స్ చేయాలంటే మటుకు Select all (Ctrl+A) మీద క్లిక్ చేయాలి.
Deselect all
సెలెక్ట్ చేసిన తర్వాత మీరు మనసు మార్చుకొని సెలక్స్ వద్దనుకుంటే Deselect all మీద క్లిక్ చేయడం ద్వారా హైలెట్ ని రద్దు చేయవచ్చు.
Multiple Paste
ఇంతకు ముందు చెప్పిన Paste ఆప్షన్ ద్వారా మీకు కొంత సమాచారం లేదా బొమ్మ లేదా బాక్స్ సృష్టించగలరు. అలాంటి బొమ్మలనే అనేకం సృష్టించాలంటే ఈ Multiple Paste ఆప్షన్ ద్వారా సృష్టించగలం.
ఇప్పుడ ఈ Multiple Paste ద్వారా మ్యాటర్ ని అనేకసార్లు ఎలా సృష్టించాలో చూద్దాం.
ముందుగా కావాల్సిన సమాచారాన్ని సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత మెనూలోని Copyని ఎన్నుకోండి. అప్పుడు Edit మెనూలోనే ఉన్న Multiple Pasteని ఎన్నకోండి. పలితంగా మీ ముందు ఓ డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
పై బాక్స్లో మీకెన్ని కాపీలు కావాలో సంఖ్య (ఉదాహరణకు 5) వేయండి. ఆ తర్వాత క్లిక్ చేయండి. ఫలితంగా మీ ముందు ఈ క్రింది విధంగా డాక్యుమెంట్లో ఐదుసార్లు అదే మ్యాటర్ ప్రింట్ అవుతుంది.
Thanking You
Thanking You
Thanking You
Thanking You
Thanking You
కేవలం సమాచారమే కాకుండా బొమ్మలు, బాక్స్లను కూడా పై విధంగా కాపీ చేయవచ్చు.
Insert Object
లోని మీద క్లిక్ చేస్తే ఫలితంగా మీ ముందు ఈ క్రింది తెర కనిపిస్తుంది.
వివిధ సాఫ్ట్వేర్లలో చేసిన ఫైల్స్ను పేజిమేకర్లో ఉపయోగించుకోవడానికి ఈ తెరలోని ఉన్న ఆప్షన్లలో ఆ ఫైల్ యొక్క సాఫ్ట్వేర్ను సెలెక్సట్ చేసుకోని Ok చేస్తే ఈ ఫైల్స్ ఓపెన్ అవుతుంది. ఆ ఫైల్లో మనకు కావలసిన విధంగా తయారుచేసుకోని Close చేస్తే ఈ ఫైల్ పేజిమేకర్ ఫైల్ లోకి వచ్చేస్తుంది.
Edit Story and Edit Original
పేజిమేకర్లోని చిన్న స్ర్కీన్ మీద మీకు అన్నిరకాల తప్పులను సవరించడం, మ్యాటర్ని కలపడం రాకపోవచ్చు. మామూలు పేజిలో అన్ని మార్పలు చేసుకోవడానికి ఇరుకుగా ఉండవచ్చు. అలాంటపుడు మన మ్యాటర్ని విశాలంగా ఉన్న మరో పెద్ద స్ర్కీన్లోకి తీసుకెళ్ళడానికి మనకు ఉపకరించేదే ఈ Edit Story ఆప్షన్. ముందుగా మీరు Edit>Edit Story మీద క్లిక్ చేస్తే నేరుగా ఒక పెద్ద స్ర్కీన్ ఉన్న డాక్యుమెంట్లోని అడుగుపెడతారు. అక్కడ మీ డాక్యుమెంట్లోని అన్ని రకాల మార్పులను చేసుకోవచ్చు. అక్కడ్నుంచి తిరిగి మామూలు తెరమీదకు రావాలంటే మటుకు Edit>Edit Original మీద క్లిక్ చేస్తే సరిపోతుంది.
No comments:
Post a Comment