Wednesday 22 February 2012

వ్యూ మెనూ (View Menu)


మ్యాటర్ను కాని, Image(బొమ్మ)లను కాని అసలైన సైజు, చిన్న సైజు, కావాల్సినసైజు కంటే ఎన్నో రెట్లు పెద్ద సైజు, జూమ్ లో చూడటం లాంటివి పేజిమేకర్ లో కూడావీక్షించవచ్చు.  విధంగా వివిధ రూపాలలో చూపించే ఆప్షన్లు లో లభ్యమవుతాయి.


Actual Size (Ctrl+1)
మనం టైప్ చేసేటపుడు పేజిమేకర్లో పేజి పెద్దదిగా లేక చిన్నదిగా కన్పించవచ్చు.
 అసలు పేజిమేకర్ లో పేజి మనకు ఎలా ఉంటుందో చూపడానికి view>actual size ని క్లిక్ చేయడం ద్వారా చూడవచ్చు.


Fit in window (Ctrl+0)
ఒకోసారి మనం పేజిని లేదా బొమ్మని జూమ్ చేసినపుడు లేదా 100 శాతం కంటే పెద్ద సైజులో చూసినపుడు అది పేజిమేకర్ పరిధి దాటిపోతుంది. దానిని తిరిగి యధాస్థితికి తేవడానికి Fit in window మీద క్లిక్ చేయడం ద్వారా చేయవచ్చు.


Zoom in
పేజిమేకర్లో డాక్యుమెంట్ లేదా బొమ్మలను మనం కావాల్సి సైజులో జామ్లో చూడడానికి మనం దీని మాద క్లిక్ చేయవచ్చు. ఇంకా పెద్దది కావాలంటే మరోసారి Zoom in మీద క్లిక్ చేయవచ్చు. అలా 400 శాతం వరకూ ఈ zoom in ద్వారా ప్రతిబింబాన్ని పెద్దది చేసి చూడవచ్చు.


Zoom out
Zoom inలో పెద్ది చేసిన ప్రతిబింబాన్ని తిరిగి చిన్నది చేసి చూడటానికి ఈ zoom out ఆప్షన్ని ఉపయోగిస్తారు.


Display Master Items
మన డాక్యుమెంట్ని ప్రింట్ చేస్తే ఏమేమి ఐటమ్స్ వస్తాయో చూడటానికి ఈ Display Master Items ఆప్షన్ ని ఉపయోగిస్తారు.

Display non-printing items
ఒకోసారి మనం చేసిన అన్నిరకాల ఐటమ్లు ప్రింటింగ్లో రావు. అలాంటి వాటిని తెలుసుకోవడానికి ఈ display non-printing items ఆప్షన్ ని ఉపయోగిస్తారు.

Hide Rulers
పేజిమేకర్ని డాక్యుమెంట్లో ఉండే లైనులు (Rules) కన్పించకుండా చేసి ఆప్షన్ ఇది. అలాగే Guides సైతం అవసరం లేదనుకుంటే view>hide Guides ద్వారా తెరమీద నుండి తొలగించవచ్చు.
Shortcuts:
Rules = Ctrl+R
Guides = Ctrl+;

No comments:

Post a Comment

Blog Archive

Followers

Powered By Blogger