పేజిమేకర్లో Text వ్రాప్ గురించి తెలుసుకుందాం
మనం తయారు చేసే పేజీలో మ్యాటర్, బొమ్మలు రెండూ ఉంటాయి. అయితే మ్యాటర్మధ్యలో బొమ్మని ఉంచేటపుడు ఈబొమ్మని పేజీ మధ్యలో ఏ పొజిషన్ లో (మధ్యనలేదా చివరనా) అన్న సందేహం వస్తుంది. ఆ బొమ్మ చుట్టూ ఎంతరూరంలో మ్యాటర్ఉండాలన్న సందేహం రావచ్చు. ఈ సమస్యం పరిష్కారానికే వెలువడిన ఆప్షనే Text Wrap. టెక్స్ట్, బొమ్మలు ఒకదానికి ఒకటి సంఘర్షణకి గురికాకుండా కాపాడేదే Text Wrap.
ఉదహరణకు క్రింది బోమ్మను గమనించండి ఇక్కడ ఒక కథకు సంబంధించిన మేటర్ ప్రక్కనే దానికే చెందిన ఇలస్ర్టేషన్ ఉన్నాయి.
>Layout>Coloumn Guides వెళ్ళి పేజీకి 2 Columns ఇవ్వండి.
ఇలస్ర్టేషన్కు రెండు కాలమ్స్ మధ్యకు తీసుకువచ్చి ఇలస్ర్టేషన్ అవుట్లైన్ చుట్టూ మేటర్ అమర్చాలంటే Text Wrap కమాండ్ ఉపయోగించాలి. పేజిమేకర్లోని ముఖ్యమైన వాటిలో ఇది ఒకటి.
తరువాత Text Wrap కమాండ్ ఇవ్వడానికి ముందు Text మొత్తాన్ని Ctrl+A ద్వారా సెలెక్టు చేసుకుని (Text కర్సర్ మేటర్ పై ఉండాలి) Type మెనూలోకి వెళ్లి >Alignment>Justify (Shift+Ctrl+J) కమాండ్ ఇవ్వండి.
ఇలస్ర్టేషన్ను కాలమ్స్ మధ్యకు తీసుకురావాలి. ఇలస్టేషన్ సెలెక్ట్ చేయబడి ఉండగానే Element మెనూకు వెళ్లి Text Wrap క్లిక్ చేస్తే క్రింది విధంగా బాక్స్ వస్తుంది.
పేన వరుసలో మూడు ఆప్షన్లు ఉంటాయి.
క్రింది వరుసలో వున్న మూడు ఆప్షన్లలో కూడా కావాల్సిన దానిని క్లిక్ చేయాలి.
Text Wrap సెట్టింగ్ పేజిలో Wrap Option వద్ద భాగంలో మధ్యనున్న ఐకాన్పై క్లిక్ చేసి ఒక ఆప్షన్ను ఎన్నకుందాం. Stand off in MM వద్ద Tab కీ అన్నివైపులా ఇవ్వండి. డిఫాల్ట్గా ఉన్న వాల్యూ బదులుగా ఇవ్వాలి. Tab కీ ఉపయోగిస్తూ ఒక దాని నుండి మరొకదానికి సెలెక్టు చేసుకుంటూ వెళ్లవచ్చు. ఇప్పుడు Ok చేయండి.
ఇమేజ్పై పై కమాండ్ అప్లయి చేయబడి కనబడుతుంది.
బొమ్మ చుట్టూ చుక్కలతో ఒక రెక్టాంగిల్ సెకెక్షన్ కనపబడుతుంది. దీనికి నాలుగు మూలలా 4 నోడస్ ఉంటాయి. పాయింటర్ను ఎడమవైపు పై భాగంలో ఉన్న నోడ్ వద్దకు తీసుకువెళ్ళి మౌస్ లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి లోపలివైపు డ్రాగ్ చేయండి.
ఇప్పుడు చుక్కలతో కనపడుతున్న సెలెక్షన్ ఎక్కడైనా మౌస్తో క్లిక్ చేసి నోట్స్ క్రియేట్ చేయవచ్చు. అలా క్రియేట్ చేసిన నోడ్స్ను మౌస్ పాయింటర్తో ఏ దిశలోనైనా డ్రాగ్ చేయవచ్చు. బొమ్మ అవుట్ లైను వంపు తిరిగిన ప్రతిచోట నోట్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇలస్ర్టేషన్ అవుట్ లైను చుట్టూ అవసరమైన చోటల్లా నోడ్స్ క్రియేట్ చేస్తూ టెక్ట్సును బొమ్మ చుట్టూ అమర్చాలి. Text Wrap కమాండ్ ఇచ్చిన తరువాత కూడా బొమ్మను సెలక్టు చేసుకుని పైకి లేదా ప్రక్కలకు జరుపుకునే వీలుంది.
బొమ్మ 2 లో చూపించిన విధంగా వోవెల్ చుట్టూ Text Wrap కమాండ్ ఇవ్వవలసి వచ్చినపుడు మధ్య భాగంలో ఉన్న హెడ్డింగ్ స్ర్ఫింగ్ వోవెల్ స్ర్పింగ్ బయటికి మించి ఉండరాదు.
Text Wrap గురించి మరింత సమాచారం కోసం లో దీనికి సంబంధించిన ఒక ట్యుటోరియల్నుఇక్కడ క్లిక్ చేసి చూడండి. ఈ ఫోరమ్ లో చూడాలంటే రిజిస్ర్టేషన్ తప్పనిసరి.
No comments:
Post a Comment