మన USB Drives లలో డాటా ఏమీ కనబడకుండా Disk space మాత్రం full గా చూపిస్త్తూ ఉంటే దానికి వైరస్ లు కారణం కావచ్చు. వైరస్ లు మన డాటాని కనబడకుండా చేస్తాయి. అయితే ఒక్కొక్కసారి యాంటీ వైరస్ సాప్ట్ వేర్లతో స్కాన్ చేసినా కూడా ఫైళ్ళు కనబడకపోతే ఈ క్రింది విధంగా చెయ్యండి:
1. USB Drive ని పీసీ కి కనెక్ట్ చెయ్యాలి. My Computer లో దాని డ్రైవ్ లెటర్ తెలుసుకోవాలి.
2. Start---> Run కి వెళ్ళి cmd అని టైప్ చేసి Enter కొట్టండి.
౩. command prompt వస్తుంది. అక్కడ USB Drive లెటర్ ప్రక్కన : టైప్ చేసి Enter చెయ్యాలి. (Ex: మీ USB Drive letter I అయితే కనుక కమాండ్ ప్రాంమ్ట్ దగ్గర I: అని టైప్ చేసి enter press చెయ్యాలి)
4. ఇప్పుడు command prompt దగ్గర ఈ క్రింది విధంగా కమాండ్ type చెయ్యాలి
attrib -s -h /s /d *.*
పైన చెప్పిన command లో -s, -h, /s మరియు /d ల మధ్య ఒక స్పేస్ ఉండాలి. Enter కొట్టండి. కొన్ని సెకన్ల తర్వాత తిరిగి కమాండ్ పాంమ్ట్ వస్తుంది. అప్పుడు USB Drive ని remove తిరిగి కనెక్ట్ చెయ్యండి. అంతే ఇంతకు ముందు వైరస్ లచే దాచబడిన ఫైల్స్ మరియు పోల్డర్లు ఇప్పుడు కనిపిస్తాయి. ఇప్పుడు యాంటీ వైరస్ ప్రోగ్రామ్ లను రన్ చేసి వైరస్ లను క్లీన్ చేసుకోవచ్చు.
No comments:
Post a Comment