పేజిమేకర్ ఓపెన్ చేసినపుడు వచ్చే తెరను పేజిగా పరిగణిస్తారు. ఆ పేజి సైజు,పరిమాణం మొదలైన విషయాలనునిర్దారించే మెనూనే Layout మెనూ అంటారు. Layout మెనూలోని రకరకాల ఆప్షన్లను తెలుసుకొని వాటి ద్వారాడాక్యుమెంట్లనిమరింత అందంగా తీర్చిదిద్దవచ్చు.
Go to Page (Ctrl+Alt+G)
కొన్ని వందల పేజీల్లో కావల్సిన పేజీని ఎన్నకోవడానికి go to page ఈ ఆప్షన్ నిఎన్నుకుంటారు. ఉదాహరణకు మీరువ పేజీలోఉన్నారు. ఉన్నట్లుండి మీరు 6వపేజీకోని మ్యాటర్ ని చూడాలనుకున్నారు. అందుకు మనం layout>go to pageమీద క్లిక్ చేస్తే ఈ క్రింది తెర వస్తుంది. 80
ఫలితంగా మీరు వెంటనే ఆ పేజిలోకి అడుగుపెడతారు.
అలాకాకుండా మరో పద్దతి ఏమిటంటే డాక్యుమెంట్ క్రింద రూలర్లో కన్పించే పేజీల మీద మౌస్ తో కావలసి పేజి నెంబర్ మీద క్లిక్ చేస్తే ఆయా నెంబర్ గల పేజిలోకి నేరుగా ప్రవేశించవచ్చు.
Insert Pages (అదనంగా పేజీలను కలపడం)
మనం ఎక్కువుగా పేజీలు టైప్ చేశాం. ఉన్నట్లుండి మధ్యలో కొన్ని పేజీలు కలపాల్సి ఉంది. అప్పుడు layout>insert page ఏం చేయాలంటే మీద క్లిక్ చేస్తే ఈ క్రింద బొమ్మలో లాగా బాక్స్ ప్రత్యక్షమవుతుంది.
ఏ పేజి ముందు (before current page) కావాలో, లేదా ఏ పేజి తర్వాత (after current page) కావాలో అక్కడ తెలపాలి. ఫలితంగా మీకు అదనంగా ఆ పేజీలు మధ్యలో కలపబడతాయి.
Remove Pages (అవసరం లేని పేజీలను తీసేయడం)
ఒకోసారి కొంత మ్యాటర్ ని తొలగించాల్సి వస్తుంది. తొలగించిన కారణంగా కొన్ని పేజీలను తీసెయాల్సి వస్తుంది. అందుకు ఉపయోగపడే ఆప్షనే Remove Pages.
దీనిని తెరవాలంటే layout>remove pages మీద క్లిక్ చేస్తే ఈ క్రింది విధంగా తెర కనిపిస్తుంది.
మీకు అవసరం లేని పేజీలను తొలగించిన వెంటనే వాటి తర్వాత పేజీలు వాటంతట అవే మిగతా మ్యాటర్ని, బొమ్మలను అవే సర్దుబాటు చేసుకుంటాయి.
గమనిక: డాక్యుమెంట్ లేదా ఫైల్ క్రింద రూలర్లో కన్పించే పేజీల మీద మౌస్ తో రైట్ క్లిక్ చేస్తే Add one page, Insert Pages, Remove Pages ఆప్షన్లలలో కావలసిన దానిలోనికి నేరుగా వెళ్ళవచ్చు.
Sorting Pages
పేజీలను ఒక ప్రత్యేకమైన వరుసలో ఉంచటాన్నే shorting అంటారు. ఈ shorting pages ఆప్షన్ వల్ల మన డాక్యుమెంట్ లోని పేజీలను ఒక క్రమబద్దమైన ఆర్డర్ లో ఉంచడం తేలికవుతుంది. Layout>sort pages మీద నొక్కడం వల్ల ఈ క్రింది ఆప్షన్ లభ్యమవుతుంది.
పై బొమ్మలోని అనేక రకాలైన డాక్యుమెంట్లను మనకు కావాల్సిన వరుసలో ఉంచడానికి మౌస్ సహాయంతో ఆ డాక్యుమెంట్ మీద నొక్కి డ్రాగ్ చేసి ఇతర చోటుకు గాని, ప్రక్క పేజీల వద్దకు కాని తీసుకువెళ్ళవచ్చు. అలా పేజీలన్ని కావాల్సిన రీతిలో సర్దబాటు చేయవచ్చు.
Column Guides
ఒకసారి మన టెక్స్ట్ మొత్తం పేజిల్లోని వివిధ కాలమ్ లలో రావాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు తెలుగు వారపత్రికలు చూసినట్లయితే నిలువుగా ఉన్న కాలమ్ లలో మ్యాటర్ ఉంచడం చేసే ఉంటారు. అలా మ్యాటర్ కాలమ్ లలో రావాలంటే ఈ columns guidesమీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఫలితంగా మీ ముందు ఈ క్రింది బాక్స్ వస్తుంది.
పై బాక్స్ లో మొదటగా మీకు పేజికెన్ని కాలమ్ లు కావాలో పేర్కొని ఆ తర్వాత OK మీద క్లిక్ చేస్తే ఆయా కాలమ్ లు మీ పేజిల్లో ఇలా ప్రత్యక్షమవుతాయి.
Autoflow
ఒక పేజీ లేదా ఫేరాగ్రాఫ్ లో ఎక్కవ మ్యాటర్ ఉన్నపుడు ఆ పేజి లేదా ఫేరాగ్రాప్ నిండగానే, మరుసటి పేజి లేదా పేరాగ్రాఫ్ కి మ్యాటర్ తనంతటతానే వెళ్ళడానికి ఈ Autoflow ఆప్షన్ ని ఉపయోగిస్తారు. చేయాల్సిందల్లామ్యాటర్ ఎక్కడనుండి ప్రారంభం కావాలో టూల్ బాక్స్ లో టెక్స్ట్ టూల్ ద్వారా సూచించాలి.
No comments:
Post a Comment