Thursday, 5 January 2012


Adobe Illustrator లో Rounded Rectangle Tool [Image: Rounded_rectangle_tool_icon.jpg] ను ఉపయోగించి కాన్వాస్ మీద షేప్ గీసే సమయంలో Rounded Rectangle Shape కార్నర్స్ యొక్క రేడియస్ ను మనకు కావలసిన విధంగా ఎలా అడ్జస్ట్ చేయవచ్చో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం.

[Image: change_round_corner_adobe_illustrator_telugu_01.jpg]
Rounded Rectangle Shape కార్నర్స్ యొక్క రేడియస్ ను అడ్జస్ట్ చేయడానికి రెండు పద్ధతులను ఉపయోగిస్తారు.

మొదటి పద్ధతి:
Edit » Preferences » General ను క్లిక్ చేసి (లేదా Ctrl+K ప్రెస్ చేసి) క్రింద చూపిన విధంగా Corner Radius ను సెట్ చేయవచ్చు.




రెండవ పద్ధతి:
షేప్ ను కాన్వాస్ మీద గీసే సమయంలోనే కీబోర్డులోని యారో కీస్ నుపయోగించి కార్నర్ రేడియస్ ను మనకు కావలసిన విధంగా అడ్జస్ట్ చేయవచ్చు.
[Image: change_round_corner_adobe_illustrator_telugu_03.jpg]

ఈ పద్ధతిలో షేప్ ను గీసిన వెంటనే మౌస్ బటన్ ను రిలీజ్ చేయకుండా యారో కీస్ నుపయోగించాలి.

క్రింది స్క్రీన్ షాట్లను గమనించండి.

1. కార్నర్ రేడియస్ ను పెంచడానికి Up arrow ను ఉపయోగించాలి. Up arrow ను ప్రెస్ చేసి వదిలిన ప్రతిసారి కార్నర్ రేడియస్ పెరుగుతూ ఉంటుంది.
[Image: change_round_corner_adobe_illustrator_telugu_04.jpg]





2. కార్నర్ రేడియస్ ను తగ్గించడానికి Down arrow ను ఉపయోగించాలి.
[Image: change_round_corner_adobe_illustrator_telugu_05.jpg]





3. కార్నర్ రేడియస్ ను ఒకే సారి పూర్తిగా తగ్గించడానికి Left arrow ను ఉపయోగించాలి.
[Image: change_round_corner_adobe_illustrator_telugu_06.jpg]





4. కార్నర్ రేడియస్ ను ఒకే సారి పూర్తిగా పెంచడానికి Right arrow ను ఉపయోగించాలి.
[Image: change_round_corner_adobe_illustrator_telugu_07.jpg]


No comments:

Post a Comment

Blog Archive

Followers

Powered By Blogger