Sunday, 22 January 2012

hey mana sys lo data lose kakunda malli re partition cheyalanteeeeeeeeee

కంప్యూటర్లోని డాటా (ఫైళ్లు, ఫోల్డర్స్) మరియు సమాచారం మొత్తం హార్డ్ డిస్క్‌లో బద్రపరచపడి ఉంటుంది. డాటాను పార్టిషన్ల వారీగా నిల్వ ఉంచితే మంచిది. కానీ చాలా మంది కంప్యూటర్ వినియోగదారులు తమ హార్డ్ డిస్క్‌ను రెండు పార్టిషన్లుగా (ఒకటి ఆపరేటింగ్ సిస్టమ్ కొరకు, ఒకటి తమ ఫైళ్లు నిల్వ చేస్కోవడానికి) మాత్రమే చేస్తారు. ఇక ల్యాప్ ట్యాప్‌ల సంగతైతే చెప్పనవసరంలేదు. కొనుగోలు చేసినపుడు ఒకే రూట్ పార్టిషన్, అందులోనే అన్నీ ఉంటాయి. ఇలాంటి సందర్భాలలో హార్డ్ డిస్క్‌లో బ్యాడ్ సెక్టార్స్ ఏర్పడో, లేక షడన్‌గా క్రాష్ అయి ఏ ఒక్క పార్టిషన్ కరప్ట్ అయినా కూడా అందులో ఉన్న డాటా మొత్తం లాస్ అయినట్లేగా? ఇలాంటి సంఘటనలు జరిగినపుడు డాటా మొత్తం లాస్ కాకుండా ఉండాలంటే: హార్డ్ డిస్క్‌లోని కంటెంట్‌ను పార్టిషన్ల వారిగా విభజించడం మంచిది. 

(Note: హార్డ్ డిస్క్‌లో డాటా లాస్ కాకుండా కరప్ట్ అయిన పార్టిషన్ ఎలా రికవర్ చేయాలో తర్వాత ట్యటోరియల్‌లో తెలుసుకుందాం.)

ఉదా:కు మీ ముఖ్యమైన ఫైళ్లు అన్నింటికీ [(D: ) IMP DATA] ఒక పార్టిషన్, సినిమాలు మరియు పాటలుకు [(E: ) ENTERTAINMENT] ఒక పార్టిషన్ . 

ఇలా విభజించడం వలన ఏ పార్టిషన్ కరప్ట్ అయిందో అందులోని డాటాను మాత్రమే లాస్ అవుతాము. పార్టిషన్లుగా విభజించడం వలన మిగిలిన డాటా సేవ్ అయినట్లే కదా! 
ఇపుడు మీ సందేహం:"ఇపుడు రన్నింగ్‌లో ఉన్న నా కంప్యూటర్లోని పార్టిషన్లను ఏ మాత్రం డాటా లాస్ కాకుండా విభజింగలనా?" అనే కదా!
ప్రస్తుతం సమర్ధవంతంగా రీపార్టిషన్ చేయగలిగే అనేక ఫ్రీ సాఫ్ట్వేర్లు లభిస్తున్నాయి. మీ కంప్యూటర్లోనని డేటా ఏ మాత్రం లాస్ కాకుండా ఇవి రీపార్టిషన్ చేయగలుగుతాయి. ఇలా ఉచితంగా లభించే హార్డ్ డిస్క్ పార్టిషన్ మేనేజర్స్‌లో గొప్పగా చెప్పుకోతగ్గది EASEUS Partition Manager. క్రింది ట్యుటోరియల్‌ను ఫాలో అవాలంటే ఈ సాఫ్ట్వేర్‌ను డౌన్లోడ్ చేస్కొని మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయండి.

Image has been scaled down 7% . Click this bar to view full image (640x567).
[Image: easeuspartitionmanagerg.jpg]


EASEUS Partition Manager పవర్ ఫుల్ ఫీచర్స్‌తో ఉచితంగా లభిస్తుంది. 
ముఖ్యమైన ఫీచర్స్:
  • పార్టిషన్ సైజ్‌ను మీకు కావలసిన విధంగా (ఉదా:కు 10జీబీని 7జీబీగా , 20జీబీని 30జీబీగా) రీసైజ్ చేయవచ్చు.
  • పార్టిషన్‌ను ఒక చోట నుంచి మరో చోటుకు మూవ్ చేయవచ్చు.
  • మరొక కొత్త పార్టిషన్‌ను క్రియేట్ చేయవచ్చు.
  • ఉన్న పార్టిషన్‌ను డెలిట్ చేయవచ్చు.
  • పార్టిషన్‌ను ఫార్మాట్ చేయవచ్చు.
  • ఏ పార్టిషనైనా కనపడకుండా చేయవచ్చు. మళ్లీ అన్ హైడ్ చేయవచ్చు.
  • ఏ పార్టిఫనైనా యాక్టివ్ పార్టిషన్‌గా సెట్ చేయవచ్చు.
  • క్లస్టర్ సైజ్‌ను ఆటోమేటిక్‌గా మరియు మాన్యువల్‌గా కూడా మార్చగలము.
  • ప్రతి స్టెప్‌లో అన్‌డూ (స్టెప్ బ్యాక్) చేయగలము.
  • పై అన్నీ ఆపరేషన్స్‌లో కూడా మీ డేటాకు ఎటువంటి లాస్ జరగదు.
  • సులభంగా అర్థమయే ఇంటర్‌ఫేస్.
  • 2జీబీ నుంచి 1టీబీ వరకు సపోర్ట్ చేస్తుంది.
  • RAID Hardwareను కూడా సపోర్ట్ చేస్తుంది.
  • Windows 2000/XP/Vista/Windows7 లలో పనిచేస్తుంది.
  • Linuxకు వేరే వర్షన్ లభిస్తుంది.

EASEUS Partition Manager నుపయోగించి ఒక పార్టిషన్ రీసైజ్ చేసి ఆ పార్టిషన్‌లో మిగిలిన భాగంతో కొత్త పార్టిషన్‌ను ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. క్రింది స్క్రీన్ షాట్‌లో గమనించండి. అందులోని D డ్రైవ్‌ను ఉపయోగించి కొత్త పార్టిషన్‌ క్రియేట్ చేయబోతున్నాము.

[Image: resizepartition.jpg]

1. Start >> Programs >> EASEUS Partition Manager ను క్లిక్ చేయండి. సాఫ్ట్వేర్ ఒపెన్ అయిన తర్వాత క్రింద చూపిన విధంగా D డ్రైవ్ మీద రైట్ క్లిక్ చేసి Resize/Moveను క్లిక్ చేయండి.

Image has been scaled down 21% . Click this bar to view full image (751x557).
[Image: easeuspartitionmanager.jpg]


2. Resize/Move Partition డైలాగ్ బాక్స్‌లో Size and Position బార్‌లోని స్లైడర్‌ను మీకు కావలసిన సైజ్‌కు మూవ్ చేయండి. ఇక్కడ నేను 11140MB (10.89GB) కి సెట్ 
చేశాను. ఇపుడు OK బటన్‌ను క్లిక్ చేయండి.

[Image: resizemovepartition.jpg]

3. ఇపుడు D డ్రైవ్ 10.89GB గా మారిపోయింది. మిగిలిన భాగం అలోకేట్ చేయబడలేదు కాబట్టి పార్టిషన్‌గా మారకుండా అలానే ఉంది. క్రింది స్క్రీన్ షాట్‌లో గమనించండి.

Image has been scaled down 9% . Click this bar to view full image (659x259).
[Image: partitionresized.jpg]


4. ఇపుడు మిగిలిన భాగంతో కొత్త పార్టిషన్‌ను క్రియేట్ చేయండి. క్రింద చూపిన విధంగా Unallocated డ్రైవ్ మీద రైట్ క్లిక్ చేసి Create క్లిక్ చేయండి.

Image has been scaled down 8% . Click this bar to view full image (652x196).
[Image: createpartition.jpg]


5. Create Partition ప్రాపర్టీస్ విండోలో క్రింద చూపిన విధంగా పార్టిషన్ టైప్ (logical, primary), ఫైల్ సిస్టమ్ మరియు డ్రైవ్ వాల్యూమ్ నేమ్ ను మీకు కావలసిన విధంగా సెట్ చేసి OK ప్రెస్ చేయండి. (కేవలం పార్టిషన్ లేబుల్ టైప్ చేస్తే సరిపోతుంది. అవసరమనుకుంటేనే మిగిలిన సెట్టింగ్స్ ఛేంజ్ చేయండి.

పార్టిషన్ టైప్:

[Image: logicalprimarypartition.jpg]

ఫైల్ సిస్టమ్:

[Image: selectfilesystem.jpg]

పార్టిషన్ లేబుల్: (ఇక్కడ నేను IMP DATA అనే లేబుల్ ఉపయోగించాను)

[Image: partitionlable.jpg]

6. ఇపుడు IMP DATA అనే పేరు మీద G: అనే కొత్త డ్రైవ్ ఏర్పడింది.

Image has been scaled down 5% . Click this bar to view full image (631x229).
[Image: newpartition.jpg]


7. పై స్టెప్ వరకు అన్నీ ఆపరేషన్స్ వర్చువల్‌గానే జరుగుతాయి. ఫైనల్‌గా Apply క్లిక్ చేస్తేనే ఇప్పటివరకు మీరు చేసిన సెట్టింగ్స్ అప్లై అవుతాయి. ఓకే అనుకుంటే Apply క్లిక్ చేయండి.

Image has been scaled down 6% . Click this bar to view full image (636x507).
[Image: applypartitionchanges.jpg]


8. ఇపుడు Apply Changes అనే ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. Yes బటన్‌ను క్లిక్ చేయండి.

[Image: confirmv.jpg]

9. సిస్టమ్ రూబూట్ వార్నింగ్ కనిపిస్తుంది. Yes బటన్‌ను క్లిక్ చేయండి.

[Image: rebootz.jpg]

10. సిస్టమ్ రీస్టార్ట్ అయి బూటింగ్ టైంలో క్రింది విధంగా ప్రాసెసింగ్ విండోస్ కనిపించి మీరు చేసిన సెట్టింగ్స్ అన్నీ అప్లై అవుతాయి.

Image has been scaled down 15% . Click this bar to view full image (700x400).
[Image: easeuspartitionmasterbo.jpg]


11. సిస్టమ్ పూర్తిగా ఓపెన్ అయిన తర్వాత My computer ఓపెన్ చేసి చూడండి. కొత్తగా క్రియేట్ చేసిన డ్రైవ్ కనిపిస్తుంది.

[Image: newdrivecreated.jpg]

ఇలాంటి ఇతర సాఫ్ట్వేర్ల లింకులు:

Read more: Hard Disk re-partition without losing data - Tutorial in Telugu » Telugu Tech Forum, Telugu Multi-Media Tutorials - Srisailam. http://www.mahigrafix.com/hard-disk-re-partition-without-losing-data-tutorial-in-telugu.html#ixzz1kBZkhSht

No comments:

Post a Comment

Blog Archive

Followers

Powered By Blogger