Sunday, 22 January 2012

a-new-image-format-webp-for-websites-load-fast.

WebP అనే కొత్త ఇమేజ్ ఫార్మాట్‌ను గూగుల్ అందిస్తోంది. ఏ మాత్రం క్వాలిటీ లాస్ కాకుండా అతి తక్కువ సైజ్‌లోకి కంప్రెస్ చేయబడి వెబ్ పేజ్‌లో ఎంబెడ్ అవగలగడం దీని ప్రత్యేకత. ప్రత్యేకించి ఒక JPEG ఇమేజ్‌ను క్లారిటీ మిస్ కాకుండా 39.8% వరకు ఫైల్ సైజ్‌ను తగ్గించగలదు. ఇమేజి క్వాలిటీ మరియు సైజ్‌లను గమనిస్తూ మనకు కావలసిన మేరకు కంప్రెస్ చేయగలిగే సదుపాయం ఇందులో ఉంది. (RIFF) Resource Interchange File Format మరియు VP8 Image Analyzer ల ఆధారంగా WebP ఫైల్ తయారు చేయబడుతుంది. తక్కువ పరిమాణంలో నాణ్యత ఏ మాత్రం లోపించకుండా WebP ఇమేజ్‌లను క్రియేట్ చేయగలదు. వెబ్ డెవెలెపర్స్ ఈ WebP ద్వారా కంప్రెస్ చేయబడిన ఇమేజిలను ఉపయోగించి వెబ్సైట్‌లను వేగంగా లోడ్ అయేవిధంగా చేయగలరు. ఏటువంటి పెద్ద ఇమేజినైనా వేగంగా మరియు సులభంగా WebPలోకి కన్వర్ట్ చేయడానికి, మరియు అన్నీ ఫైళ్లను ఒకేసారి కన్వర్ట్ చేయడానికి WebP టీమ్ లినక్స్ 86 మరియు 64 బిట్ కొరకు బైనరీ మోడ్‌ను క్రియేట్ చేసింది. ఇమేజిని కన్వర్ట్ చేసిన తర్వాత డిస్క్ లోకి కానీ, సర్వర్‌లోకి కానీ డౌన్లోడ్ చేస్కోగలము.

WebPలో కన్వర్ట్ అయిన ఇమేజి శాంపిల్స్ కొరకు ఇక్కడ చూడండి: http://code.google.com/speed/webp/gallery.html
పూర్తి వివరాలకు: http://code.google.com/speed/webp/ ను విజిట్ చేయండి.
WebP ఫార్మాట్‌లోకి ఇమేజ్‌ను ఎలా కన్వర్ట్ చేయాలి అనే విషయంపై త్వరలోనే మరో పోస్ట్‌లో తెలుసుకుందాం.

No comments:

Post a Comment

Blog Archive

Followers

Powered By Blogger