Wednesday, 23 May 2012

ఫోటోషాప్ లో కొత్త ప్లగ్గిన్స్ ని ఇన్ స్టాల్ చేసుకోవడం మరియూ వాడే విధానం


నేను రెండు మూడు చోట్ల గమనించిన ప్రకారం ఫోటో స్టూడియో వాళ్ళకు కూడా ప్లగ్గిన్స్ ని వాడటం,ఇన్ స్టాల్ చెయ్యటం తెలియదు.
1700_Photoshop_Plugins_by_myszka011
అందువలన ఈ ట్యుటోరియల్ ఇక్కడ పెట్టడం వలన అందరూ నేర్చుకుంటారనే ఉద్దేశంతో ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను.మరి ఇంకెందుకాలస్యం ఫోటోషాప్ ఓపెన్ చేసి ట్యుటోరియల్ ఫాలో అవ్వండి..

మొదటగా ప్లగ్గిన్స్ లో రకాలు మరియూ అవి ఎలా ఉంటాయో తెలుసుకుందాం…ప్లగ్గిన్స్ నేడు ఆన్ లైన్ లో రెండు రకాలుగా లభిస్తున్నాయి.వాటిలో ఒకటి నేరుగా సెటప్ ఫైల్ ద్వారా ఇన్ స్టాల్ చేసేది.రెండవ రకం ఫోటోషాప్ రూట్ ఫోల్డర్ లోని plug ins ఫోల్డర్ లోనికి నేరుగా పేస్ట్ చేసి వాడుకునేవి.

ఇప్పుడు మొదటి రకం ప్లగ్గిన్స్ ని ఎలా ఇన్ స్టాల్ చెయ్యాలో చూద్దాం.ఇవి చూడటానికి క్రింద విధంగా ఉంటాయి.ఇక్కడ మూడు రకాల ప్లగ్గిన్ లను చూపించాము.
1

ఇప్పుడు మీరు ఏ ప్లగ్గిన్ అయితే ఇన్ స్టాల్ చెయ్యదలచుకున్నారో ఆ ప్లగ్గిన్ మీద డబుల్ క్లిక్ చెయ్యండి.తరువాత కొన్ని ఆప్షనల్ స్టెప్స్ ని పూర్తిచేసిన తరువాత చూడటానికి క్రింద విధంగా ఒక స్క్రీన్ వస్తుంది(నా ఉద్దేశం ప్రకారం అచ్చంగా ఇలాగే రాదు గానీ కొన్ని కొన్ని తేడాలతో చూడటానికి ఈ విధంగానే ఉంటుంది).ఇక్కడ స్క్రీన్ ఒకసారి గమనిస్తే మీకు ఒకటి అర్ధమవుతుంది అది ఏమిటంటే నేను ఫోటోషాప్ CS3 ,ఫోటోషాప్ 7 లని నా పీసీ లో ఇన్ స్టాల్ చేసినట్లు తెలుస్తుంది.ఇప్పుడు ఈ స్క్రీన్ లో నుండి మీరు ఏ వెర్షన్ ఫోటోషాప్ లోకి ఈ ప్లగ్గిన్ ఇన్ స్టాల్ చెయ్యదలచుకున్నారో ఆ వెర్షన్ ని ఎంచుకోండీ(నేను CS3 ని ఎంచుకున్నాను).తరువాత ఇన్ స్టాల్ అనే బటన్ ని క్లిక్ చెయ్యండి.

3

అంతే అయిపోతుంది.ఇప్పుడు రెండవ రకానికి చెందిన ప్లగ్గిన్స్ ని ఎలా ఇన్ స్టాల్ చెయ్యాలో తెలుసుకుందాం..

ఇప్పుడు చెప్పబోయే రెండవ రకానికి చెందిన ప్లగ్గిన్ లు చూడటానికి క్రింద విధంగా ఉంటాయి .
4

వీటిని సింపుల్ గా కాపీ చేసుకుని C:\Program Files\Adobe\Adobe Photoshop CS3\plug-ins అనే ఫోల్డర్ లోకి పేస్ట్ చెయ్యడమే.ఇక్కడ abobe photoshop cs3 అనే చోట మీరు వాడే వెర్షన్ బట్టి ఈ ఫోల్డర్ పేరు ఆధారపడి ఉంటుంది.అంతే అయిపోయింది.ఇప్పుడు ఇన్ స్టాల్ చేసిన ప్లగ్గిన్ లని ఎలా వాడాలో చూద్దాం.

ఫోటోషాప్ ని ఓపెన్ చేసి ప్లగ్గిన్ ను ప్రయోగించాలనుకున్న ఇమేజ్ ని ఓపెన్ చేసి.Filter మెనూలో మీరు ఇన్ స్టాల్ చేసిన ప్లగ్గిన్ అన్నింటి కంటే చివరన కనిపిస్తూ ఉంటుంది దానిని క్లిక్ చేసి వాడుకోవడమే.క్రింద తెరపట్టు గమనించండి.

5

sparkling Effect on photo :- photoshop tutorial


ఈ క్రింద ఇమేజ్ ని చూడండి.ఎంత బాగుందో కద.

19

మీ ఫొటోకి కూడా ఈ విధంగా Sparkling Effect ని యాడ్ చెయ్యాలనుకుంటున్నారా అయితే ఈ ట్యుటోరియల్ మీ కోసమే.మరి ఇంకెందుకాలస్యం…

step 1 :- File > Open ని క్లిక్ చేసి పై ఎఫెక్ట్ ని యాడ్ చెయ్యదలచుకున్న ఇమేజ్ ని ఓపెన్ చెయ్యండి.
1
step 2 :- ఇప్పుడు ఒక కొత్త లేయర్ ని క్రియేట్ చెయ్యండి.దీని కోసం layers pallete లోని create New Layer 2 బటన్ ని ప్రెస్ చెయ్యండి.
3
Step 3 :- ఇప్పుడు పెన్ టూల్ ని సెలక్ట్ చేసుకుని తరువాత ఆప్షన్ బార్ లో Paths అనే ఆప్షన్ ని క్లిక్ చెయ్యండి.
4
5
Step 4 :- ఇప్పుడు ఇమేజ్ పై పెన్ టూల్ ని వాడి క్రింద విధంగా Paths ని క్రియేట్ చెయ్యండి.
6
Step 4 :- ఇప్పుడు Brush Tool ని సెలక్ట్ చేసుకుని Brush Pallete లో 9 px hard brush ని సెలక్ట్ చెయ్యండి.
  7
8
Step 5 :- ఇప్పుడు మళ్ళీ Pen Tool ని సెలక్ట్ చేసుకుని ఇమేజ్ పై క్రింద చూపిన విధంగా రైట్ క్లిక్ చేసి Stroke Path ని క్లిక్ చెయ్యండి.
9
ఇప్పుడు క్రింద విధంగా ఒక చిన్న విండో ఓపెన్ అవుతుంది.దానిలో క్రింద చూపిన విధంగా సెట్టింగ్ చేసి ఓకే ని ప్రెస్ చెయ్యండి.
10
ఇప్పుడు ఇమేజ్ చూడటానికి ఇలా ఉంటుంది.
11
Step 6 :- ఇప్పుడు లేయర్స్ ప్యాలెట్ లో paths విభాగంలోని Work path పై రైట్ క్లిక్ చేసి Delete Path ని క్లిక్ చెయ్యండి.లేదా కీబోర్డ్ లోని Back space బటన్ ని రెండు సార్లు క్లిక్ చేసినా చాలు.
12
Step 7 :- మళ్ళీ లేయర్ విభాగం లోకి తిరిగి వచ్చి Layer 1 పై రైట్ క్లిక్ చేసి Blending Options ని క్లిక్ చెయ్యండి.
13
Step 8 :- ఇప్పుడు Blending Options లో వరుసగా Outer Glow మరియూ Drop Shadow లను  ఈ క్రింద చూపిన విధంగా సెట్ చేసి OK బటన్ ని ప్రెస్ చెయ్యండి.
14
15
ఇప్పుడు ఇమేజ్ కి ఎఫెక్ట్ యాడ్ అయి క్రింద విధంగా కనిపిస్తుంది.
16
Step 10 :- ఇప్పుడు Eraser Tool ని సెలక్ట్ చేసి ఈ క్రింద చూపిన విధంగా హైలైట్ చేసిన చోట్ల Erase చెయ్యండి.
17
18
పైన స్టెప్స్ మొత్తం కంప్లీట్ అయ్యిన తరువాత మీ ఇమేజ్ క్రింద విధంగా ఉంటుంది.
20
అదే విధంగా మీ క్రియేటివిటీ ని ఉపయోగించి రకరకాలైన ఇమేజ్ లపై రకరకాలుగా ఈ ఏఫెక్ట్ యాడ్ చెయ్యవచ్చు.నేను చేసిన కొన్ని డిజైన్స్ కూడా క్రింద చూడండి.
19
 trinadh new sparks

About Professional Audio System

ఈ రోజుల్లో మల్టీమీడియా-ఆడియో విజువల్ ఒక ప్రధానమైన విషయమయింది ఈ కార్పోరేట్ సమాజంలో !
ప్రతీ వారికి వీటిగురించిన కొద్దో గొప్పో నాలెడ్జీ అవసరమవుతుంది !!

ఈ వెబ్ సైట్ లో మీకు ప్రొఫెషనల్ ఆడియో గురించి మాగ్జిమం వివరాలు దొరుకుతాయి.
సాధారణమైన స్పీకర్ సిస్టం నుండి పెద్ద పెద్ద కాన్సెర్టుల్లో వాడే ఆడియో కు సంబందించిన
వివరాలు మీకు లభిస్తాయి.
వీటిని పెద్ద పెద్ద ఆడియో విజువల్ కంపనీలు తమ ప్రాజెక్టుల్లో వాడతారు.



http://www.electrovoice.com/index.php


ఇక బేసిక్ పబ్లిక్ అడ్రస్ సిస్టం గురించి పీ డి యఫ్ ఫైల్ ను చూడండి .

చాలా ఇంటెరెస్టింగ్ సబ్జెక్ట్ ఇది.

Change audio of Video song in CVS


Corel Video Studio నుపయోగించి ఒక వీడియో సాంగ్ యొక్క ఆడియో ను ఎలా మార్చాలో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం.
1. Start >> Programs >> Corel Video Studio ను క్లిక్ చేసి క్రింది విధంగా VideoStudio Editor ను క్లిక్ చేయండి.
Image has been scaled down 20% . Click this bar to view full image (748x432).
Change audio of Video song

2. Time Line లో క్రింద చూపిన విధంగా Right Click చేసి Insert Video ను క్లిక్ చేయండి.
 Change audio of Video song
3. ఆడియో మార్చాలనుకున్న Video Song ను ఓపెన్ చేయండి.
 Change audio of Video song
4. Time Line లో Video Track మీద Right Click చేసి Split Audio ను క్లిక్ చేయండి.

Image has been scaled down 5% . Click this bar to view full image (627x614).
Change audio of Video song

5. వీడియో సాంగ్ లో ఉన్న ఆడియో ట్రాక్ విడిపోయి క్రింది విధంగా చూపబడుతుంది. ఆ ఆడియో ట్రాక్ మీద Right Click చేసి Delete ను క్లిక్ చేయండి.
Change audio of Video song
6. ఇపుడు Time Line మీద Right Click చేసి Insert Audio >> To Music Track ను సెలెక్ట్ చేయండి.
Change audio of Video song
7. మార్చాలనుకున్న ఆడియో సాంగ్ ను మీ సిస్టమ్ నుంచి ఓపెన్  చేయండి.
Change audio of Video song
8. మీరు లోడ్ చేసిన కొత్త ఆడియో క్రింది విధంగా Music Track లో కనిపిస్తుంది.
 Change audio of Video song
9.  Share >> Create Video File ను క్లిక్ చేసి, Same as First Video Clip ను సెలెక్ట్ చేసి కొత్త ఆడియోతో వీడియో ఫైల్ ను సేవ్ చేయండి.
 Change audio of Video song
Change audio of Video song


Sunday, 20 May 2012

సొంత సైట్ కావాలనుకుంటే ?




ఒక సొంత సైట్ కావాలనుకుంటే ఎక్కడ మొదలుపెట్టి ఏమేమి చేయాలో తెలుసుకోండి.
సొంత సైట్ కోసం మనం చేయాల్సినవి మూడు పనులు.

సైట్ పేరు ఎంచుకోవడం

సైట్ పేరుని డొమైన్ లేదా సీమనామము అంటారు. ముందు మీ సైట్/బ్లాగ్ కి ఒక పేరు ఎంచుకోండి. తర్వాత మీరు ఆ సైట్ ఎందుకు వాడాలనుకుంటున్నారో అన్నదాన్ని బట్టి దాని చివర .com, .in, .net, .ఆర్గ్, .info లాంటి వాటిల్లో ఏది ఎంచుకోవాలో చూసుకోండి. ఏది పెట్టుకున్నా పర్వాలేదు కానీ, కాస్త అర్థవంతంగా ఉంటే మంచిది కాబట్టి చూసి నిర్ణయించుకోవడం మంచిది. ఉదాహరణకి అది మీ వ్యక్తిగాతమైతే మనది భారతదేశం కాబట్టి .in పెట్టుకోవచ్చు. అది ఒక e-commerce లాంటి కమర్షియల్ వాటి కైతే .com అని పెట్టుకోవచ్చు. స్వచ్చంద సంస్థల వంటివాటికి  .org బావుంటుంది. సమాచారం అందరికి పంచే సైటైతే .info అని పెట్టుకోవచ్చు. .net అంటే ఇదివరకు నెట్వర్క్ కి సంబందించిన ఒక అర్థం ఉండేది కానీ, ఇప్పుడు ఆ అర్థంతో వాడుతున్నట్టేమి కనబడట్లేదు. కానీ, సైట్ అంటే .com యేనని మనసులో ముద్రపడిపోయింది చాలా మందికి. ఇప్పుడిప్పుడే అంతర్జాలం విస్తరిస్తున్న పల్లెల్లో ఈ భావన ఎక్కువ. కాబట్టి మీ సైట్ కి వచ్చేవారు ఎవరు అనేదాన్నిబట్టి కూడా చూసుకోవాలి.

ఆ పేరు రిజిస్టర్ చేయడం

ఈ రిజిస్ట్రేషన్ ఎన్ని సంవత్సరాలకైన తీసుకోవచ్చు. లేదా ఇక ఎప్పటికి ఆ పేరు మీదే అన్నట్టు కూడా రిజిస్టర్ చేయించుకోవచ్చు. రిజిస్ట్రేషన్ కి చాలా సైట్లు ఉన్నాయ్. ఉదాహరణకి హోస్ట్.acగో డాడీరిజిస్టర్.కాం చూడండి. మిగతా వాటి కోసం గూగుల్ ని అడిగితే సరి. ఆ సైట్లలో ఏదైనా ఒకటి ఎంచుకుని అక్కడ మీరు అనుకున్న పేరు లభ్యత ఉందేమో చూసుకోండి. లేకపొతే ఇంకో పేరు ప్రయత్నించాలి. ఒకవేళ ఉంటే క్రెడిట్ కార్డు ద్వారానో, పేపాల్ ద్వారానో, మరే ఇతరమార్గం ద్వారానో ఆ పేరు కొనుక్కోవాలి. మామూలుగా అయితే సంవత్సరానికి .in తో ముగిసే పేర్లు 20 డాలర్లు దాకా ఉంటే, మిగతావన్నీ 10 డాలర్లు ఉంటాయి.

జాల జాగా కొనుక్కోవడం

ఇప్పుడు మీ సైట్ లో మీరు పెట్టాలనుకున్నవన్నీ పెట్టడానికి ఒక జాగా లేదా ఆవాసం కావాలి. మామూలుగానైతే మీరు ఎక్కడైతే ఆ పేరు కొన్నారో, వాళ్ళ దగ్గరే ఆవాసం కూడా కొనుక్కునే సౌలభ్యమ్ ఉంటుంది. కానీ మీ అవసరాన్ని బట్టి, మీరు ఎంత ఖర్చుపెట్టాలనుకుంటున్నారో అన్నదాన్నిబట్టి వేరే చోట్ల కూడా వెతికిన తర్వాత నిర్ణయించుకోవడం మంచిది. ఉదాహరణ కి g33k హోస్టింగ్బ్లూ హోస్ట్హోస్ట్.acలాంటి ఆవాసదాతల్ని చూడండి.
ఇప్పుడు పేరూ, జాగా సిద్ధం! తర్వాత ఏం చేయాలో వచ్చే టపాలో చూద్దాం!!

వెబ్ సర్వీసు, Web Service



వెబ్ సర్వీసు అనగా ఏమిటి, ఎలా పనిచేస్తుంది, దీని వలన ఉపయోగాలు ఏమిటోతెలుసుకొనుట.
వెబ్ సర్విసు అనగా భవిష్యత్తు విలువలలో, ఈ-వ్యాపారంలో మార్పు తెచ్చేఒక సాంకేతికపరిజ్ఞానము. వెబ్ సర్వీసు మన అప్లికేషనును, వెబ్ అప్లికేషను గామార్చుతుంది. వెబ్ అప్లికేషను దాని పనిని ప్రకటించును లేదా ఈవార్తను మిగిలిన ప్రపంచానికి తెలియజేయును. నెట్వర్క్ ద్వారా ప్రపంచం లోని వివిధ రకాల కంప్యూటర్లు,విస్తరించి ఉండటానికి  ఈ వెబ్ సర్వీసు తనవంతు వాతావరణాన్ని అమరుస్తుంది.

  • వెబ్ సర్వీసు, అప్లికేషను లోని ముఖ్య భాగాలలో ఒకటి.
  • వెబ్ సర్వీసు, ఓపెన్ ప్రోటోకాల్ ద్వారా వ్యాప్తి చెందుతుంది.
  • వెబ్ సర్వీసు, తనను తను వివరించును, తనలో తను కలిగియుండును.
  • వెబ్ సర్వీసు ను యుడిడిఐ ద్వారా కనుగొనవచ్చును.
  • ఒక వెబ్ సర్వీసు,  మరొక అప్లికేషను చేత ఉపయోగింపబడవచ్చును
  • వెబ్ సర్వీసు కు పునాది యక్స్ యమ్ యల్
వెబ్ సర్వీసు కు మూలకారణము యక్స్ యమ్ యల్ మరియు హెచ్  టి టి పి. 
యక్స్ యమ్ యల్( యక్సటెన్డెడ్ మార్కుప్ లాంగ్వేజ్  )
కఠినతరమైన వార్తలను, పనులను వివిధ రకాల ప్లాట్ ఫోరమ్స్ మరియు ప్రోగ్రామింగ్ భాష ల మధ్య విస్తరింప చేయుటకు ఉపయోగించే భాషను యక్స్ యమ్ యల్ అంటారు.
హెచ్  టి టి పి (హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ ఫర్  ప్రోటోకాల్) 
హెచ్  టి టి పి   ప్రోటోకాల్ సాధారణముగా వాడే ఇంటర్నెట్ ప్రోటోకాల్.

వెబ్ సర్విసు ప్రాధాన్యతలు 
  • ఇంటరోపెరబిలిటి:- సాధారణంగా ఒక అప్లికేషను ఒక ప్లాట్ ఫాం మీద మాత్రమే పనిచేయును. కానీ ఒక అప్లికేషను వెబ్ లో పనిచెయ్యాలంటే అది వివిధ రకాల ప్లాట్ ఫోరమ్స్ మీద పనిచెయ్యవలసిఉంటుంది. ప్రపంచం లోని వివిధ రకాల ప్లాట్ ఫార్మ్స్ కలసి ఒక చోట పనిచేయ్యటాన్ని వెబ్ బ్రౌజరు అంటారు.ఇలా వివిధ రకాల  ప్లాట్ ఫార్మ్స్ కలసి ఒక చోట పనిచెయ్యటానికి కావలసిన వివరణను వెబ్ అప్లికేషను అంటారు. ఒక సాధారణ అప్లికేషను, వెబ్ లొ పని చేయుచున్నచో దానిని వెబ్ అప్లికేషను అంటారు.వెబ్ అప్లికేషనును వెబ్ బ్రౌజరు పరిమాణమునకు తగినట్లుగా రూపొందించిన అది ఏ బ్రౌజరు మీద నైన, ఏ ప్లాట్ ఫాం మీద నైన పనిచేయును. వెబ్ అప్లికేషనును యక్స్ యమ్ యల్ భాష లో రాయటం చాలా సులువు. కనుక ఒక అప్లికేషను వెబ్-అప్లికేషనుగా  యక్స్ యమ్ యల్ భాషను ఉపయోగించి మార్చినచో దానిని మనం వివిధ రకాల ప్లాట్ ఫాంల మీద ఉపయోగించుకోవచ్చును.
  • ఫైర్వాల్ :- వెబ్ సర్వీసుకు ఫైర్వాలును ఎదిరించ గల సామర్ధ్యం ఉన్నది. వెబ్ సర్వీసు హెచ్ టి టి పి ప్రోటోకాలును ఉపయోగించటం ద్వారా సులువుగా ఫైర్వాలు లను దాటగలవు.
వెబ్ సర్వీసు పని తీరు
వెబ్ సర్వీసు ప్రొవైడర్లు ,వెబ్ సర్వీసును ఇచ్చువారు, తమ వెబ్ అప్లికేషనులను వెబ్ సర్వీసు రేజేస్ట్రీ లో పొందుపరచి ఉంచుతారు. క్లైంట్ ,ఎవరైతే అప్లికేషన్ ను ఉపయోగించుకోవాలనుకొంటారో వారు, ఆ వెబ్ సర్వీసు రేజేస్ట్రీలో తమకు కావలసిన అప్లికేషను కోసం వెతకుతారు. క్లైంటుకు కావలసిన అప్లికేషను దొరికినప్పుడు  ఆతను దానిని ఎంచుకోవచ్చును. ఇలా ఎంచుకొన్న అప్లికేషనును డౌన్ లోడ్ చేసుకొని దానితో బంధాన్ని ఏర్పరచుకొని దానిని ఉపయోగించుకొంటారు. అంటే ఇది పూర్తిగా వెబ్ సర్వీసు ప్రొవైడరుతోబంధాన్ని ఏర్పరచుకొని ఉపయోగించుకోవటమే.

     
వెబ్ సర్వీసు ఉపయోగాలు
  • నెట్వర్క్ ద్వారా ఒక పనికి సంబంధించిన వివరాలను విస్తరింపచేయుటకు వెబ్ సర్వీసుఉపయోగపడుతుంది. ఇలా వెల్లడి చేసిన పనిని ఏ ఇతర అప్లికేషనులు ఐనా ఉపయోగించుకోవచ్చును.
  • వెబ్ సర్వీసును ఉపయోగించి వివిధ రకాల అప్లికేషనులు తమ వివరాలను మరియు పనులనుపరస్పరం పంచుకోవచ్చును. ఉదాహరణకు .నెట్ అప్లికేషను ,జావా వెబ్ సర్వీసు తో మాట్లాడగలదుఅలాగే ఒక జావా అప్లికేషను, .నెట్ వెబ్ సర్వీసు తో మాట్లాడగలదు.
  • వెబ్ సర్వీసు, సమాచారాన్ని పంపుటకు పరిశ్రమల ప్రమాణాలకు సరిపోయే ప్రోటోకాల్ ప్రమాణమును ఉపయోగించును.దీని ద్వారా సమాచారాలు పంపుటకు ఖర్చు తక్కువై ,వాటి నాణ్యత పెరుగుతుంది.
  • సాధారణముగా వెబ్ సర్వీసు ఉపయోగించే ప్రోటోకాల్ ప్రమాణము యస్ఓఏపి మరియు హెచ్ టి టి పి.ఈ ప్రోటోకాల్ ప్రమాణమును మాత్రమే కాక మనం ఇతర ప్రోటోకాల్ లను కూడా వాడవచ్చును.ఉదాహరణకు ఎఫ్ టిపి మీద వెబ్ సర్వీసు. కనుక  ఒక వెబ్ సర్వీసు ద్వారాఎటువంటి సమాచారాన్ని ఐన పంపించవచ్చును.
  • వెబ్ సర్వీసు ఒక లాంగ్వేజ్ మీద ఆధారపడి ఉండదు. కాబట్టి దానిని ఏ సాంకేతిక పరిజ్ఞానములో రూపొందించిన ఇతర అప్లికేషన్ ఐన ఉపయోగించవచ్చును. దీని వలన బి2బి బాగా వృద్ది చెందుతుంది.
  • వెబ్ సర్వీసు తనను తాను వివరించుకుంటుంది కాబట్టి ఇతర వ్యాపార భాగస్తులు అప్లికేషన్ ను రూపొందించుటకు తక్కువ సమయం పడుతుంది మరియు ఖర్చును కూడా తగ్గించును.
  • వెబ్ సర్వీసు ద్వారా సులువుగా వ్యాపారస్తులు కావలసిన సర్వీసు ప్రొవైడర్స్ ను కలవవచ్చును. కనుక వ్యాపారము త్వరగా వృద్ది చెందుతుంది.
వెబ్ సర్వీసు మూలా భాగాలు
వెబ్ సర్వీసు మూడు మూల భాగాలను కలిగి ఉన్నది. అవి
  • యస్ ఓ ఏ పి
  • డబ్ల్యు యస్ డి యల్
  • యు డి డి ఐ
యస్ ఓ ఏ పి
హెచ్ టి టి పి మీద అప్లికేషనుకు సంబంధించిన సమాచారాన్ని మార్చుకోవటానికి ఉపయోగపడే యక్స్ యమ్ యల్ ఆధారంగా గలిగిన ప్రోటోకాల్ ను యస్ ఓ ఏ పి అంటారు.
  • ఇది వెబ్ సర్వీసు తో మాట్లాడటానికి కావలసిన ప్రోటోకాల్
  • యస్ ఓ ఏ పి అనగా సింపుల్ ఓబ్జేచ్ట్  యక్కెస్స్ ప్రోటోకాల్
  • ఇది ఒక సమాచార ప్రోటోకాల్
  • ఇది వార్తలను పంపించు ఒక నిర్మాణము
  • ఇది ఇంటర్నెట్ ద్వారా సమాచారాలను పంపించుటకు రూపొందించబడినది.
  • ఇది ప్లాట్ ఫాం స్వతంత్రము కలది.
  • ఇది భాషా స్వతంత్రము కలది.
  • ఇది యక్స్ యమ్ యల్ మీద ఆధారపడి ఉంటుంది
  • ఇది సులువైనది మరియు విస్తరింపదగినది.
  • దీని ద్వారా మనం ఫైర్వాల్ లను సులువుగా దాటవచ్చును.
  • ఇది డబ్య్లు౩సి ప్రమాణము
డబ్ల్యు యస్ డి యల్ 
వెబ్ సర్వీసును గుర్తించటానికి మరియు వివరించటానికి ఉపయోగపడే ఒక యక్స్ యమ్ యల్ మీద ఆధారపడిన భాష డబ్ల్యు యస్ డి యల్.
  • డబ్ల్యు యస్ డి యల్  అనగా వెబ్ సర్వీసు డిస్క్రిప్షన్ లాంగ్వేజ్.
  • ఇది  యక్స్ యమ్ యల్ మీద ఆధారపడి పనిచేయును
  • ఇది వెబ్ సర్వీసును వివరించును.
  • ఇది వెబ్ సర్వీసును గుర్తించును.
  • ఇది డబ్ల్యు ౩ సి ప్రమాణము.
యు డి డి ఐ
వివిధ రకాల పరిశ్రమలకు సంబందించిన సమాచారాలను పొందుపరచే ఒక సమాచార కేంద్రము యుడిడిఐ.
  • యుడిడిఐ అనగా యునివేర్సల్ డిస్కవరీ డిస్క్రిప్షన్ మరియు ఇంటిగ్రేషన్.
  • ఇది వివిధ రకాల వెబ్ సర్వీసులను గురించిన సమాచారాన్ని పొందుపరచును.
  • ఇది తనలో పొందుపరచిన సమాచారాన్ని ఇతరులకు వివరించును
  • ఇది యస్ ఓ ఏ పి ద్వారా సమాచారాలను పంపుతుంది.
  • ఇది మైక్రో సాప్ట్ .నెట్ ప్లాట్ ఫాం మీద రూపొందించబడినది.

Blog Archive

Followers

Powered By Blogger