Corel Video Studio నుపయోగించి ఒక వీడియో సాంగ్ యొక్క ఆడియో ను ఎలా మార్చాలో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం.
1. Start >> Programs >> Corel Video Studio ను క్లిక్ చేసి క్రింది విధంగా VideoStudio Editor ను క్లిక్ చేయండి.
Image has been scaled down 20% . Click this bar to view full image (748x432).
2. Time Line లో క్రింద చూపిన విధంగా Right Click చేసి Insert Video ను క్లిక్ చేయండి.
3. ఆడియో మార్చాలనుకున్న Video Song ను ఓపెన్ చేయండి.
4. Time Line లో Video Track మీద Right Click చేసి Split Audio ను క్లిక్ చేయండి.
Image has been scaled down 5% . Click this bar to view full image (627x614).
5. వీడియో సాంగ్ లో ఉన్న ఆడియో ట్రాక్ విడిపోయి క్రింది విధంగా చూపబడుతుంది. ఆ ఆడియో ట్రాక్ మీద Right Click చేసి Delete ను క్లిక్ చేయండి.
6. ఇపుడు Time Line మీద Right Click చేసి Insert Audio >> To Music Track ను సెలెక్ట్ చేయండి.
7. మార్చాలనుకున్న ఆడియో సాంగ్ ను మీ సిస్టమ్ నుంచి ఓపెన్ చేయండి.
8. మీరు లోడ్ చేసిన కొత్త ఆడియో క్రింది విధంగా Music Track లో కనిపిస్తుంది.
9. Share >> Create Video File ను క్లిక్ చేసి, Same as First Video Clip ను సెలెక్ట్ చేసి కొత్త ఆడియోతో వీడియో ఫైల్ ను సేవ్ చేయండి.
No comments:
Post a Comment