Sunday, 20 May 2012

తాకితే చాలు మౌస్ క్లిక్ అవుతుంది

మౌస్‌ రూపం మారిపోతోంది! కుడి, ఎడమ బటన్స్‌ మాయం.. మధ్యలో స్క్రోలింగ్‌ చక్రం కనిపించదు.. ఓ కొత్త రూపం! తాకే తెర మాదిరిగా తాకే మౌస్‌ (మల్టీటచ్‌ మౌస్‌). పేరు ‘మ్యాజిక్‌ మౌస్‌'. ఐమ్యాక్‌ యూజర్లకు ప్రత్యేకంగా దీన్ని డిజైన్‌ చేశారు.




ఇదే మొదటిది..

లేజర్‌ ట్రాకింగ్‌ ఇంజన్‌తో ప్రపంచంలోని మొట్టమొదటి మల్టీటచ్‌ మౌస్‌గా దీన్ని రూపొందించారు. వైర్‌, అడాప్టర్‌ల అనుసంధానం లేకుండా బ్లూటూత్‌ వైర్‌లెస్‌ టెక్నాలజీతో ఇది మ్యాక్‌ని 33 అడుగుల దూరం నుంచి కూడ యాక్సెస్‌ చేస్తుంది. ఎక్కడా బటన్స్‌ కనిపించకుండా ఆకర్షణీయంగా డిజైన్‌ చేశారు. అంటే మౌస్‌ అంతా ఒక్కటే బటన్‌ అన్నమాట. క్లిక్‌, డబుల్‌ క్లిక్‌లను మౌస్‌ పై భాగంలో ఎక్కడైనా చేయవచ్చు. మౌస్‌పై వేలు పెట్టి కదిలించడం ద్వారా ఏ వైపు పాయింటర్‌ని ఆపరేట్‌ చేయవచ్చు. దీన్నే 360 డిగ్రీల స్కోల్‌గా పిలుస్తున్నారు.
ఏదైనా ఇమేజ్‌ను జూమ్‌ఇన్‌, జూమ్‌అవుట్‌, చేయాలనుకుంటే కీబోర్డ్‌లోని కంట్రోల్‌ కీని నొక్కి ఉంచి మౌస్‌ పై భాగంలో వేలిని కిందికీ, పైకీ జరిపితే సరి. Two Button Clickతో రైట్‌ క్లిక్‌ను ఎనేబుల్‌ చేయవచ్చు. అంతేకాదు ఎడమ చేతివాటం ఉన్న వారు సిస్టం ప్రిఫరెస్సెస్‌లోకి వెళ్లి సెట్టింగ్స్‌ను మార్చుకోవచ్చు. చిత్రంలో చూపిన మాదిరిగా రెండు వేళ్లనూ కలిపి జరుపూతూ వెబ్‌ పేజీలు, ఫొటోలను పుస్తకంలో పేజీల మాదిరిగా తిరగేయవచ్చు. మౌస్‌ సెట్టింగ్స్‌ని మార్చాలనుకుంటే డాక్‌బార్‌లోని System Preferenceలోకి వెళ్లి Mouse ని ఎంచుకోండి. Tracking,Scrolling,Double Click, One Finger, Two fingers నచ్చినట్టుగా మార్చుకోవచ్చు. దీంట్లో ఏర్పాటు చేసిన బ్యాటరీల సామర్థ్యం సుమారు నాలుగు నెలలు.
మేజిక్ మౌస్ వినియోగం కోసం ఈ క్రింది వీడియోని  వీక్షించండి :
ధరెంతో తెలుసా? రూ.3,700.00 Magic Mouse

No comments:

Post a Comment

Blog Archive

Followers

Powered By Blogger