Sunday, 20 May 2012

ఐఫోన్‌తో ప్రయాణం...




హాయ్‌ హాయ్‌!
ఐఫోన్‌తో ప్రయాణం... హాయ్‌ హాయ్‌! 
నిత్యం ప్రయాణాలు చేస్తుంటారా? ఐఫోన్‌తో అవి మరింత సులువని తెలుసా? టికెట్టు బుకింగ్‌.. రాకపోకల వివరాలు.. విశ్రాంతి గృహాలు.. మ్యాప్‌లు.. ఇలా ఎన్నో అప్లికేషన్స్‌ సిద్ధంగా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందామా? ఐఫోన్‌! అరచేతిలో అదు్భతం. ఇందులో ప్రయాణాల కోసం కొన్ని ప్రత్యేక అప్లికేషన్స్‌ని రూపొందించారు. వాటితో టికెట్టు బుకింగ్‌ దగ్గర్నుంచి విమానాల రాకపోకల్ని లైవ్‌లోనే తెలుసుకోవచ్చు. వెళ్లాలనుకున్న ప్రదేశం వివరాల్ని మ్యాపింగ్‌ ద్వారా పొందొచ్చు. హోటల్స్‌, విశ్రాంతి గృహాల వివరాల్ని చిటికెలో తెలుసుకోవచ్చు.

అంతా ‘లైవ్‌'లోనే! 
విమాన ప్రయాణానికి సమయం మించిపోయినప్పుడు విమాన రాకపోకల్ని తెలుసుకోవాలంటే FlightTrack ఉంటే చాలు. దీన్ని ఐఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకుంటే ప్రపంచంలో ఎక్కడైనా విమానాల రాకపోకల వివరాల్ని లైవ్‌లో పొందొచ్చు. లైవ్‌ ఇంటర్నేషనల్‌ ఫెk్లట్‌ మ్యాప్స్‌ ద్వారా వివరాల్ని ఇతరులతో పంచుకోవచ్చు. రాకపోకల్లో మార్పులు, నిలిపివేతల సమాచారం కూడా ఎప్పటికప్పుడే. గేట్‌ నెంబర్‌, బ్యాకేజీ కెk్లమ్‌ వివరాల్ని కూడా పొందొచ్చు. వివరాలకుwww.mobiata.com/iphone-apps/flighttrack-live-flight-status-tracker 

మ్యాప్‌ మార్గాలు 
వెళ్లాలనుకున్న ప్రదేశానికి సంబంధించిన అన్ని వివరాల్ని పొందడానికి help, My Maps, MapMe, Mobile Map Me, Medicare Offices Near You లాంటి ప్రత్యేక అప్లికేషన్స్‌ రూపొందించారు. వీటి ద్వారా ఆయా ప్రాంతాల్లోని హోటల్స్‌, కేఫ్‌లు, విశ్రాంతి భవనాల వివరాల్ని పొందొచ్చు. MapMe తో మీరెక్కడున్నారో తెలుసుకుని ఆయా లోకేషన్స్‌ను స్నేహితులతో పంచుకోవచ్చు. వివరాలకుwww.apple.com/webapps/travel/index2.html 

మాట్లాడుతూ చెబుతుంది! 
ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడి వ్యక్తుల్ని అడిగినట్టుగా మీ ఐఫోన్‌ని ప్రశ్నించే సౌకర్యం ఉంది. HearPlanet ద్వారా అది మీ ప్రశ్నకు సమాధానం చెప్పేస్తుంది. వివరాలకు www.hearplanet.com ను చూడండి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ హాస్టల్స్‌ వివరాల్ని HI Hostels తో పొందొచ్చు. మీరు సందర్శించబోయే దేశాల చరిత్రను తెలుసుకోవాలంటే Pocket Guide to World History, State Info ఇన్‌స్టాల్‌ చేసుకోండి. వివరాలకు యాపిల్‌స్టోర్‌ను చూడండి. 

హోటల్స్‌ కోసం 
మీరు సందర్శిస్తున్న దేశంలోని హోటల్స్‌ వివరాల్ని HotelRadarతో పొందొచ్చు. 55,000 హోటల్స్‌ వివరాలను దీంట్లో పొందుపరిచారు. పర్వత ప్రాంతాలు, మంచు కొండల్లో కూడా మీరెక్కడున్నారో తెలుసుకోవాలంటే Accuterra ను ఇన్‌స్టాల్‌ చేసుకుంటే సరి. ఈ పీసీఆర్‌ఎస్‌ సర్వీస్‌ ఆఫ్‌లైన్‌ నెట్‌వర్క్‌లోనూ మ్యాప్‌ని అందుబాటులో ఉంచుతుంది. దీంతో మీరు సందర్శిస్తున్న ప్రాంతాన్ని సులువుగా బ్రౌజ్‌ చేసుకోవచ్చు. వివరాలకు www.accuterra.com ను చూడండి. టూర్‌లో చూడబోయే ప్రాంతాన్ని NextStop తో బ్రౌజ్‌ చేయండి. సెర్చ్‌బాక్స్‌లో ప్రాంతాన్ని టైప్‌ చేసి ఎక్స్‌ప్లోర్‌ చేయవచ్చు. మరిన్ని Travel అప్లికేషన్స్‌కు www.apple.com/webapps/travel/ను చూడండి.

No comments:

Post a Comment

Blog Archive

Followers

Powered By Blogger