Sunday, 20 May 2012

లినక్సులో FFMPEG



ఇంతకు ముందు ఒక పోస్టులో FFMPEG విండోస్ లో ఎంత సులువుగా ఉపయోగించవచ్చో చూశాము. ఇప్పుడు, లినక్సు లో FFMPG గురించి వివరాతి వివరంగా తెలుసుకుందాం.


1. ఎలా ఇన్స్టాల్ చేస్కోవాలి?
లినక్స్ లో వచ్చే చిక్కేంటంటే, రకరకాల లినక్సు లు ఉండి, దేనికి దానికే ఒక్కో పద్దతి ఉంటుంది. కాబట్టి అన్నిటికీ పని చేసేలా ఒక పద్దతి చెప్తాను, చేసెయ్యండి! ముందు, ఈ క్రింది చెప్పిన లైబ్రరీ లు అన్నీ ఇన్స్టాల్ చేస్కోవాలి. మీరు వాడే లినక్సులో సాఫ్ట్వేర్లు ఇన్స్టాల్ చేస్కొడానికి ఒక ప్యాకేజీ మేనేజర్ ఉంటుంది (ఫెడోరా ఐతే యమ్, ఉబుంటు ఐతే సినాప్టిక్/అప్ట్-గెట్) దానిలో ఈ క్రింది పదాలతో శోదించి, ఆ వచ్చిన ఫలితాల్లో, ఆయా పేర్లతో ఉన్న ప్యాకేజీ లను, వాటి డెవలప్మెంట్ ప్యాకేజీ లను  ఇన్స్టాల్ చేసెయ్యండి. ఒకవేళ మీకు ఆ ప్యాకేజీ మేనేజర్ లు వాడటం తెలియకపోతే ఇక్కడ తెలుసుకోండి.
liba52
libgsm
libxvid
libamr
libmp3lame
libogg
libvorbis
libfaac
libfaad
libx264
ఉదాహరణకి, మీరు libogg గురించి శోదిస్తే, అక్కడ వచ్చిన వాటిల్లోంచి libogg0, libogg-dev లను ఇన్స్టాల్ చేయాలి, అలా అన్నిటికీ చెయ్యాలి.  ఇది పూర్తయ్యాక,  ఇక్కడున్న ప్యాకేజీ ని డౌన్లోడ్ చేస్కొండి. ఆ డౌన్లోడ్ చేస్కోగా వచ్చిన ప్యాకేజీ ని ముడి విప్పండి(అంటే untar చేయండి అని, క్రింద, దానికి కూడా కమాండ్ ఇచ్చాను, చూడండి). ఆ తర్వాత, విప్పితే వచ్చిన డైరెక్టరీ కి ఒక టెర్మినల్ లో వెళ్లి, ఈ క్రింది కంమాండ్లు కొట్టండి.
మీరు డౌన్లోడ్ ఎక్కడికి చేసారో, అక్కడికి ఒక టెర్మినల్ లో వెళ్లి, ఇలా ముడివిప్పండి.
tar -xvf ffmpeg-0.5.tar.bz2
ఇప్పుడు ఒక ఫోల్డర్ వస్తుంది. అందులోకి వెళ్ళండి.
cd ffmpeg-0.5
ఇప్పుడు ఈ క్రింది మూడు కంమాండ్లు కొట్టేయండి.
./configure --enable-gpl --enable-libfaac --enable-libfaad --enable-libgsm --enable-libmp3lame --enable-libtheora --enable-libvorbis  --enable-nonfree  --enable-shared --enable-x11grab --enable-libx264 --enable-libxvid --enable-pthreads --enable-libopenjpeg --enable-swscale
make
make install
make కొట్టాక కొంచెం టైం పడుతుంది (కొంచెం అంటే చా.....లా అన్న మాట! హాయిగా బొంచేసి రావచ్చు!). తర్వాత make install కొట్టడం మర్చిపోకండి. అంతా సవ్యంగా అయిపోతే, ఇక మీ పంట పండినట్టే :) అవ్వకుంటే, ఇక్కడ అడిగేస్తే, తెలిసినవారు జవాబిస్తారు.
అక్కడితో ఇన్స్టాల్ చేయడం సమాప్తం! ఇక పని చేస్తుందో లేదో చూడడానికి ఒక రాయి వేద్దాం, ఏదన్నాఆడియో/ వీడియో ఉంటే పట్రండి. మీరు తెచ్చిన ఆ వీడియో పేరు sample.mp3 అనుకుందాం. ఇప్పుడు అది కనీసం ౫ నిమిషాల నిడివి ఉందనుకుంటే, అందులోంచి ౨ నిమిషాల నుంచి ౩ నిమిషాల మధ్యలో ఉన్న ముక్కని ఒక wav లా కట్ చేద్దాం. దానికి ఈ కమాండ్ కొట్టండి.
ffmpeg -sameq -ss 00:02:00 -t 00:01:00 -i sample.mp3 sample.wav
మీరు అనుకున్నట్టు వస్తే మనం కుమ్మేసినట్టే. రాకపోతే, అదేమంటుందో చెప్తూ ఇక్కడ ఒక వ్యాఖ్యలో అడగండి, పరిష్కారం చెప్తాము. వచ్చే పాఠ్యాంశంలో ffmpeg తో మరిన్నినిత్య ఉపయోగకర కంమాండ్ల తో, ఇంకొన్ని వివరాలు తెలుసుకుందాం.

No comments:

Post a Comment

Blog Archive

Followers

Powered By Blogger