Sunday 20 May 2012

మీరు విండొస్ ఎక్స్ పీ వాడి వాడి విసుగు చెందిపోయినారా




మీరు విండొస్ ఎక్స్ పీ వాడి వాడి విసుగు చెందిపోయినట్లయితే, ఒక కొత్త లుక్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే మీ కోసం అంతర్జాలము(ఇంటర్ నెట్)లో ఎన్నో రకాల కొత్త లుక్ తో మీకు విండొస్ ఎక్స్ పీ ఆపరేటింగ్ సిస్టములు లభిస్తున్నాయి. వీటి ప్రత్యేకతలు ఏమిటంటే మీరు ఆపరేటింగ్ సిస్టం లోడ్ చేసుకున్న తరువాత డ్రైవర్స్ ఇన్ స్టాల్ చేసుకోనవసరం లేదు మరియు ఒక పి.సి. యూజర్కి అవసరమైన కొన్ని మృదులాంత్రములు (సాప్ట్ వేర్స్)కూడా వీటితో పాటు మనకు ఇన్ స్టాల్ అవుతాయి.( విన్ యాంప్,మీడియా ప్లేయర్11, ఇంటర్ నెట్ ఎక్స్ ప్లోరర్ 7, యాంటీ వైరస్, బర్నర్స్, సిస్టం టూల్స్, ట్వీకింగ్ యుటిలిటీస్ మొదలైనవి).అటువంటి ఆపరేటింగ్ సిస్టములకు
ఉదాహరణ:
1. విండోస్ డార్క్ ఎడిషన్
2. విండోస్ బ్లాక్ ఎడిషన్
3. విండోస్ క్రిస్టల్ ఎక్స్ పీ
4. విండోస్ రాయల్ ఎక్స్ పీ
5. విండోస్ వెబ్మొసిస్ ఎక్స్ పీ
6. విండోస్ స్పైడర్మాన్ ఎక్స్ పీ
ఇలాంటివి ఇంకెన్నో మీకు అంతర్జాలములో వెదకినట్లయితే లభిస్తాయి.
మీరు కూడా ఇటువంటి ఆపరేటింగ్ సిస్టం స్వంతముగా తయారు చేసుకోవచ్చు. 

No comments:

Post a Comment

Blog Archive

Followers

Powered By Blogger