ఈ టపాలో క్రింద తెలిపిన విషయాలను తెలుసుకొందాం :
- షెల్ అనగానేమి?
- ఎక్స్‌టెర్మ్, జీనోం టెర్మినల్ , కంసోల్ అంటే?
- దీన్ని తెరవటం ఎలా?
- కీ-బోర్డు పరిక్ష
- మౌసు వాడటం
- ఫోకస్ గూర్చి కాస్తంత
షెల్ అనగానేమి?
సులువుగా చెప్పాలంటే, మీరు కీబోర్డ్ నుండి ఇచ్చిన కమ్యాండ్ లను తీసుకొని ఆపరేటింగ్ సిస్టంకు ఇచ్చే ప్రోగాం ఈ షెల్. మొదట్లో (అంటే 3 దశాబ్దాల క్రితం) యునిక్స్ కంప్యూటర్ లను దీని సాయంతో మాత్రమే అదేశించగలిగే వారు.
ఈ రోజుల్లో కమాండ్ లైన్ ఇంటె్ర్‌ఫేస్ తో పాటుగా గ్రాఫికల్ యూజర్ ఇంటెర్‌ఫేస్ కూడా ఉంది. చాలావరకు లినక్స్ కంప్యూటర్లలో బ్యాష్ అనే ప్రోగ్రాం ఈ షెల్ లాగా పని చేస్తుంది. మరికొన్ని ఉదాహరణలు bash, ksh, tsh, zsh, sh
ఎక్స్‌టెర్మ్, జీ-నోం టెర్మినల్ , కంసోల్ అంటే?
వీటిని టెర్మినల్ ఎములేటర్లు అంటారు. ఈ ప్రోగ్రాములు ఒక విండో ద్వారా షెల్ తో సంభాషించటానికి ఉపయోగపడుతాయి. ఇలాంటి టెర్మినల్ ఎములేటర్లు బోలెడున్నాయి. ఉదాహరణకు xterm, gnome-terminal, kvt, console, rxvt, nexterm మరియూ eterm.
దీన్ని తెరవటం ఎలా?
మీ లినక్స్ కే.డి.ఇ ఐతే konsole అని ఉంటుంది. ఒక వేళ జీ-నోం ఐతే gnome-terminal అని ఉంటుంది.
ఈ లంకె లో ఉన్న టపా టెర్మినల్ ఎందుకు వాడాలి, ఎలా తెరవాలి అన్న విషయాలను తెలియజేస్తుంది.
కీ-బోర్డు పరిక్ష :
ఇప్పుడు టైపు చేయడం చూద్దాం. క్రింద బొమ్మలో తెలిపిన విధంగా మీ పేరు మరియూ మీ కంప్యూటర్ పేరుతో పాటుగా ఒక $ గుర్తు ఉంటుంది.
సరే! ఇప్పుడు అర్థంలేని అక్షరాలని టైప్ చే్సి ఎంటర్ నొక్కండి.
అంతా సవ్యంగా జరిగి ఉంటే మీరు టైపు చేసినది అర్థం కాలేదని ఒక ఎర్రర్ మెసేజ్ ఇచ్చి ఉంటుంది.
ఇప్పుడు కీబోర్డులో, పైకి చూపుతున్న బాణం గుర్తును నొక్కి మీరు ఇదివరకూ టైప్ చేసిన కమ్యండును "kdkjflajfks" చూడవచ్చు. అవునండి కమ్యాండు చరిత్రని బద్రపరుస్తుంది. మళ్ళీ ఖాళీ లైను రావటానికి క్రిందికి చూపుతున్న బాణం గుర్తును నొక్కండి. అలాగే ఏదైనా కమ్యాండు టైపు చేస్తున్నప్పుడు ఆ కమ్యాండులో ముందుకూ వెనక్కూ కదలటానికి కుడీ ఎడమ వైపు చూపే బాణం గుర్తులను నొక్కండి.
మీరు పొరపాటునకూడా రూట్ ఎకౌంటులో ప్రస్తుతం లాగిన్ అవ్వలేదు కదా?
అత్యావశ్యక పరిస్థితుల్లో తప్ప, మరెప్పుడూ సూపర్ యూజర్ గా లాగిన్ అవ్వటం మూర్ఖత్యం, ప్రమాదకరం. ఒక వేళ మీకు రూట్ ఎకౌంటు తప్ప వేరే ఎకౌంటు లేనట్టైతే తక్షణం ఒక సాధారణ యూజర్ ఎకౌంటు సృష్టించుకోండి.
మౌసు వాడటం :
లినక్స్ వాడటానికి 3-బటన్ల మౌసు కావాలి(మూడింటిలో ఒకటి స్క్రోల్ బటన్ అయ్యి ఉంటే మంచిది). షెల్ కమ్యాండ్ల తో పని చేసేది అయ్యినప్పటికీ ఇందులో కూడా మౌసును కాపీ/పేస్టు చేయటానికీ స్క్రోల్ చేయటానికీ వాడవచ్చు.
ఫోకస్ గూర్చి కాస్తంత :
విండోలు వాటిలోటి ఫోల్డర్లు చూపటానికి లినక్స్ కూడా విండోస్ లాగానే కనిపిస్తుంది. కానీ, విండొస్ లో ఏ విండో మీద క్లిక్ చేస్తే అది యాక్టివ్ అవుతుంది. లినక్స్ లో మౌస్ పాయింటర్ ఎక్కడుందో ఆ విండో యాక్టివ్ అవుతుంది. దీనర్థం అది ముందుకు వస్తుంది అని కాదు. మీరు ఏ విండొ మీదైనా మౌస్ పాయింటర్ ఉంచి స్క్రోల్ చేస్తే అది పైన ఉన్నా లేకపోయినా స్క్రోల్ అవుతుంది. ఇది ఒక మంచి అనుభూతి మరియూ చిరాకు తగ్గించే ఫీచర్. ప్రయత్నించండి మీకూ నచ్చుతుంది!
Source: http://www.linuxcommand.org/lts0010.php
No comments:
Post a Comment