Sunday, 20 May 2012

మీ కంప్యూటర్ లోని ఒక హార్డ్ డ్రైవ్ ని ఎవరికీ కనబడకుండా దాచేయాలనుకుంటున్నరా?

మీ కంప్యూటర్ లోని ఒక హార్డ్ డ్రైవ్ ని ఎవరికీ కనబడకుండా దాచేయాలనుకుంటే ముందుగా Start బటన్ పై క్లిక్ చేసి Run కమాండ్ సెలక్ట్ చేయాలి. అపుడు వచ్చే విండోలో Diskpart 
అని టైప్ చేసి ఎంటర్ కీ ని నొక్కండి.
 అపుడు డాస్ లో Diskpart> అని కమాండ్ ప్రాంప్ట్ వస్తుంది. దాని ప్రక్కన List Volume అని టైప్ చేసి ఎంటర్ కీ ని నొక్కండి. అపుడు మన కంప్యూటర్ లోని అన్ని వాల్యూములను చూపిస్తుంది. అపుడు మనము దాచేయాలనుకున్న డ్రైవ్ యొక్క వాల్యూములను ముందుగా సెలక్ట్ చేయాలి. ఉదాహరణకు వాల్యూము 2 E డ్రైవ్ అయితే Select volume 2 అని టైప్ చేసి ఎంటర్ కీ ని నొక్కండి. అపుడు వాల్యూము 2 అంటే E డ్రైవ్ సెలక్ట్ అవుతుంది.  డ్రైవ్ ఇక కనబడకూడదంటే Remove letter E అని టైప్ చేసి ఎంటర్ కీ ని నొక్కండి. ఒక్కొక్కసారి కంప్యూటర్ రీస్టార్ట్ చేయవలసి రావచ్చు. ఇక మీకు E  డ్రైవ్ మీకు కనిపించదు. కంగారు పడకండి మీ డాటా ఎక్కడికీ పోదు. మనము కేవలం దాచామంతే. మరలా కనిపించాలంటే  పైన చెప్పిన విధముగా మరలా చేసి Remove letter E అన్న చోట Assign letter E అని టైప్ చేస్తే చాలు.

No comments:

Post a Comment

Blog Archive

Followers

Powered By Blogger