ఇలా పని చేస్తుంది
సైట్‌లోకి వెళ్లి మెనూబార్‌లోని డౌన్‌లోడ్ పైన క్లిక్ చేసి ఇన్‌స్టాల్ చేయండి. దీన్ని రన్ చేయాలంటే ..net Fremework 3.5 మీ సిస్టంలో ఉండాలి. ఇన్‌స్టలేషన్ ప్రక్రియ పూర్తవ్వగానే బ్లేజ్ ఐకాన్ రూపంలో సిస్టం ట్రేలో ప్రత్యక్షమవుతుంది. దీన్ని ఓపెన్ చేయడానికి Alt+Ctrl+Spacebar లను కలిపి నొక్కితే సరిపోతుంది. ఇది డిఫాల్ట్‌గా ఏర్పాటు చేసిన హాట్‌కీ. Settings లో మీకు నచ్చినట్టుగా షార్ట్‌కట్‌కీని క్రియేట్ చేసుకోవచ్చు. విండోస్ కమాండ్ ఆప్షన్ మాదిరిగా ఓపెన్ అయ్యే బుల్లి విండోని Skins తో వివిధ రకాలుగా మార్చుకోవచ్చు. ఇక మీరు ఏదైనా సాఫ్ట్‌వేర్‌ను రన్ చేయాలనుకుంటే షార్ట్‌కట్‌కీతో బ్లేజ్‌ను ఓపెన్ చేసి విండోలో ప్రోగ్రాం పేరును టైప్ చేసి ఎంటర్ నొక్కితే చాలు. ఉదాహరణకు మీరు ఫైర్‌ఫాక్స్‌ని ఓపెన్ చేయాలనుకుంటే టెక్ట్స్‌బాక్స్‌లో Fir అని టైప్ చేయగానే ప్రోగ్రాం పాత్‌తో సహా చూపిస్తుంది. ఒకవేళ మీరు తప్పు టైప్ చేసినా సరైన స్పెల్లింగ్‌ను చూపిస్తుంది కూడా. డాస్ కమాండ్స్‌ని కూడా దీంట్లో రన్ చేయవచ్చు. ల్యాప్‌టాప్స్, యూఎస్‌బీ డ్రైవ్‌ల్లో కూడా దీని ఉపయోగం ఎక్కువే! వివరాలకు http://blaze-wins.sourceforge.net/
No comments:
Post a Comment