Sunday, 20 May 2012

మార్చేయండ మౌస్‌ పాయింటర్‌ని





మౌస్‌ పాయింటర్‌. కంప్యూటర్‌తో పని చేసేవారు దీన్ని నిత్యం ఫాలో అవుతూ ఉండాల్సిందే. సిస్టంపై పనులు చక్కబెట్టేందుకు ఇదో ప్రత్యేక వారధి. ఇంతటి ప్రాధాన్యమున్న పాయింటర్‌ని ఒకేలా చూసి చూసి బోర్‌ కొడుతోందా? భిన్నమైన ఎఫెక్ట్స్‌తో పాయింటర్‌ను మీకు నచ్చినట్టుగా మార్చుకోవాలనుకుంటున్నారా? అయితే, CursorFX 2.01 ను ఇన్‌స్టాల్‌ చేసుకోండి!

సైట్‌లోకి వెళ్లి కనిపించే Download Now  క్లిక్‌ చేసి సెట్‌అప్‌ ఫైల్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోండి. దీంతో My Cursors, Effects, Trails, Sounds, More Cursors, Settings ఆప్షన్లతో బుల్లి విండో ప్రత్యక్షమవుతుంది. విండోస్‌ డీఫాల్ట్‌గా ఉన్న పాయింటర్‌ని వివిధ రకాలుగా మార్చుకోవాలంటే మై కర్సర్స్‌లో పాయింటర్లని ఎంచుకుని ఓకే చేయండి. కర్సర్‌ని ఎంచుకున్నాక విండో పై భాగంలో వివిధ రకాల యానిమేషన్స్‌ కనిపిస్తాయి. వాటిల్లో మీకు నచ్చిన దానిపై క్లిక్‌ చేసి యానిమేట్‌ చేసుకోవచ్చు. మరింత ఆకర్షణీయంగా పాయింటర్‌ని మార్చుకోవాలనుకుంటే effects ని ఎంచుకోండి. అలాగే, సౌండ్‌ ఎఫెక్ట్స్‌ ఇన్‌సర్ట్‌ చేయాలనుకుంటే ఎడమవైపున్న మెనూలోని Sounds ని క్లిక్‌ చేయండి. పాయింటర్‌ సెట్టింగ్స్‌ కోసం Settings ఎంచుకోండి. మరిన్ని కర్సర్లు కావాలనుకుంటే More Cursorsలను క్లిక్‌ చేసి సైట్‌లోకి వెళ్లి భిన్నమైన కర్సర్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్‌, వివరాలకు

No comments:

Post a Comment

Blog Archive

Followers

Powered By Blogger