సిస్టంలో ముఖ్యమైన ఫైల్స్‌తో కూడిన ఫోల్డర్లను నిక్షిప్తం చేస్తున్నారా? వాటిని సురక్షితంగా భద్రం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే, Free Folder Hider డౌన్‌లోడ్ చేసుకోండి.
పాస్‌వర్డ్ రక్షణ
పీసీలో ఏదైనా ఫోల్డర్, ఫైల్‌ని హైడ్ చేస్తే ఎవ్వరూ చూడరులే అనుకుంటే పొరబాటే! పీసీ పరిజ్ఞానం ఉన్నవారు ఫోల్డర్ ఆప్షన్స్‌ను ఎనేబుల్ చేసి చూస్తేస్తారు. ఇలాంటప్పుడు వ్యక్తిగత సమాచారాన్ని పాస్‌వర్డ్‌తో మాయం చేసే సులువైన మార్గమే ఫ్రీ ఫోల్డర్ హైడర్. దీన్ని ఇన్‌స్టాల్ చేసి షార్ట్‌కట్‌ను డబుల్ క్లిక్ చేయండి. డీఫాల్ట్ పాస్‌వర్డ్‌తో టూల్‌ని యాక్టివేట్ చేసి కొత్త పాస్‌వర్డ్‌ని ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు Add to, Remove, Open Folder, Ulock folder ఆప్షన్లతో మరో విండో ప్రత్యక్షమవుతుంది. ఇక ముఖ్యమైన ఫోల్డర్లను Add to పై క్లిక్ చేసి ప్రైవేటు ఫోల్డర్లుగా మార్చేయండి. దీంట్లో ఆయా ఫోల్డర్లు మాయం ఆయిపోతాయి. ఎప్పుడైనా వాటిని ఓపెన్ చేయాలనుకుంటే Open Folder, జాబితా నుంచి తొలగించాలనుకుంటే Remove లను క్లిక్ చేయండి. వివరాలకు http://download.cnet.com/Free-Folder-Hider/3000-2092_4-10884537.html


No comments:
Post a Comment